ETV Bharat / business

న్యూ ఇయర్​ గిఫ్ట్​ - వంట గ్యాస్ ధర తగ్గింపు - ఎంతంటే? - GAS CYLINDER PRICE TODAY

కమర్షియల్ ఎల్​పీజీ ధర స్వల్పంగా తగ్గింపు - 19 కిలోల సిలిండర్​పై రూ.14.5 ఊరట

Gas Cylinder Price
Gas Cylinder Price (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2025, 1:11 PM IST

Updated : Jan 1, 2025, 2:07 PM IST

Gas Cylinder Price Today : వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్​ ధర స్వల్పంగా తగ్గింది. 19 కిలోల ఎల్​పీజీ సిలిండర్ ధరను రూ.14.5 మేర తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు బుధవారం ప్రకటించాయి. అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఫలితంగా దేశ రాజధాని దిల్లీలో వాణిజ్య ఎల్​పీజీ సిలిండర్ ధర రూ.1804కు చేరింది. ముంబయిలో రూ.1756, కోల్​కతాలో రూ.1911, చెన్నైలో రూ.1966గా ఉంది.

గత ఐదు నెలలుగా వాణిజ్య ఎల్​పీజీ సిలిండర్ ధర పెరుగుతూ వస్తోంది. చివరగా 2024 డిసెంబర్​ 1న 19 కిలోల వంట గ్యాస్ బండ ధర రూ.16.5 మేర పెరిగింది. ఇప్పుడు ఆంగ్ల నూతన సంవత్సరాది నాడు ఎల్​పీజీ ధరను స్వల్పంగా తగ్గించాయి చమురు సంస్థలు. అయితే, గృహ అవసరాలకు వినియోగించే వంటగ్యాస్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. దిల్లీలో 14.2 కిలోల ఎల్​పీజీ సిలిండర్ ధర రూ.803గా ఉంది.

మరోవైపు, విమానాల్లో ఇంధనంగా ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్-ఏటీఎఫ్​ ధరను చమురు సంస్థలు కిలోలీటరుకు రూ.1401.37 మేర తగ్గించాయి. ప్రస్తుతం దిల్లీలో ఒక కిలోలీటరు ఏటీఎఫ్ ధర రూ.90,455.47గా ఉంది.

నోట్​ : ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్​ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్​ (బీపీసీఎల్​), హిందూస్థాన్​ పెట్రోలియం కార్పొరేషన్​ (హెచ్​పీసీఎల్)లు - బెంచ్​మార్క్​ ఇంటర్నేషనల్ ఫ్యూయెల్​, ఫారిన్ ఎక్స్ఛేంజ్​ రేట్​ ఆధారంగా, ప్రతినెలా వంట గ్యాస్​ ధరలు, ఏటీఎఫ్​ ధరలను సవరిస్తూ ఉంటాయి.

స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు అంటే మార్చి నెల మధ్యలో లీటర్​ పెట్రోల్​పై రూ.2 వరకు తగ్గించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవే ధరలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దిల్లీలో లీటర్ పెట్రోల్​ ధర రూ.94.72, లీటర్​ డీజిల్ ధర రూ.87.62గా ఉంది.

గ్యాస్ సిలిండర్ ధరలను ఎక్కడ చెక్ చేయాలి?
ఎల్​ పీజీ సిలిండర్ అసలు ధరలను తెలుసుకోవాలనుకుంటే ఇండియన్ ఆయిల్​ అధికారిక వెబ్​సైట్​ https://iocl.com/prices-of-petroleum-productsలో చూడవచ్చు. ఇదే వెబ్​సైట్​లో ఎల్​పీజీ ధరలతోపాటు, జెట్​ ఫ్యూయెల్​, ఆటో గ్యాస్​, కిరోసిన్​ మొదలైన ఇంధనాల ధరలను కూడా తెలుసుకోవచ్చు.

Last Updated : Jan 1, 2025, 2:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.