ETV Bharat / sports

46 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన బుమ్రా - ఆ స్పిన్ దిగ్గజం తర్వాత మనోడిదే ఘనత! - IND VS AUS BORDER GAVASKAR TROPHY

ఐదో టెస్ట్​లోనూ బుమ్రా అద్భుతమైన పెర్ఫామెన్స్ - ఆ స్పిన్ పేరిట ఉన్న 46 ఏళ్ల రికార్డు బ్రేక్​

Jasprit Bumrah IND Vs AUS
Jasprit Bumrah (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 4, 2025, 7:42 AM IST

Jasprit Bumrah IND Vs AUS : ఆస్ట్రేలియా పర్యటనలో భారత స్టార్‌ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అదరగొట్టేస్తున్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దూసుకెళ్తున్నాడు. అయితే సిడ్నీ వేదికగా ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతోన్న ఐదో టెస్టులో ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 46 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఆసీస్‌ గడ్డపై ఒకే సిరీస్‌లో (కనీసం 5 టెస్టులు) ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. స్పిన్‌ దిగ్గజం దివంగత బిషన్‌ సింగ్‌ బేడీ పేరిట ఉన్న రికార్డును బుమ్రా అధిగమించాడు.

బిషన్‌ సింగ్‌ బేడీ 1977/78 సీజన్‌లో ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడారు. ఆ సిరీస్‌లో ఆయన 31 వికెట్లు పడగొట్టారు. ఇప్పటి వరకు ఇదే రికార్డు కావడం విశేషం. అయితే ఇప్పుడు బుమ్రా 32 వికెట్లతో ఆ రికార్డును బ్రేక్ చేశాడు. మార్నస్ లబుషేన్‌, ఉస్మాన్ ఖవాజా వికెట్లను పడగొట్టి బుమ్రా తన ఖాతాలో ఈ ఘనతను వేసుకున్నాడు.

మరోవైపు కొత్త ఏడాదిలో అత్యధిక బౌలింగ్‌ రేటింగ్‌ సాధించిన టీమ్ఇండియా బౌలర్‌గా ఇప్పటికే బుమ్రా టాప్​లో ఉన్నాడు. అంతేకాకుడా గతేడాది 13 టెస్టుల్లో 71 వికెట్లు తీసిన బుమ్రా టాప్‌ వికెట్‌ టేకర్‌ కూడా కావడం విశేషం.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ఐదో టెస్టులో టీమ్ఇండియా బౌలర్లు సత్తా చాటారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 181 పరుగులకు ఆలౌట్ చేశారు. అలా భారత జట్టుకు 4 పరుగుల ఆధిక్యం దక్కింది. యంగ్ ప్లేయర్ బ్యూ వెబ్‌స్టర్ (57) హాఫ్ సెంచరీ నమోదు చేసి జట్టుకు టాప్​ స్కోర్​ను అందించాడు. ఇక భారత బౌలర్లలో ప్రసిధ్‌ కృష్ణ మూడు వికెట్లతో రెచ్చిపోగా, మహ్మద్ సిరాజ్ కుడా 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వీరితో పాటు నితీశ్‌ 2, బుమ్రా 2 వికెట్లను పడగొట్టాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 185 పరుగులు చేసింది.

'వాళ్లది అతి తెలివి- బుమ్రాతో గొడవకు కారణం ఇదే!'- పంత్

అప్పుడు అదే రైట్, ఇప్పుడు ఇదే కరెక్ట్- వివాదస్పదంగా థర్డ్ అంపైర్ నిర్ణయాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.