ETV Bharat / business

'అలా చేస్తే భార్య పారిపోవడం ఖాయం' - గౌతమ్​ అదానీ ఆసక్తికర వ్యాఖ్యలు! - ADANI ABOUT 70HR WORK WEEK

కుటుంబాన్ని పట్టింటుకోకుండా పనిలో మునిగిపోతే, భార్య పారిపోతుంది: గౌతమ్ అదానీ

Adani
Adani (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2025, 10:42 AM IST

Adani About 70hr Work Week : 'ఎవరైనా ఉద్యోగి వారానికి 70 గంటలు చొప్పున పనిచేస్తే, అతని భార్య పారిపోతుంది' అని అదానీ గ్రూప్​ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. వర్క్​ లైఫ్ బ్యాలెన్స్​ అంశం గురించి మాట్లాడుతూ ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

వారానికి 70 గంటలు పనిచేస్తేనే అభివృద్ధి?
అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ చేరాలంటే యువత వారానికి 70 గంటల చొప్పున పని చేయాలని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు వ్యాపారవేత్తలు, ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూనే ఉన్నారు. తాజాగా ఇదే అంశంపై అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్ అదానీ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలుచేశారు.

"వర్క్‌-లైఫ్ బ్యాలెన్స్‌ విషయంలో మీరు అనుసరిస్తోన్న విధానాలను ఇతరులపై రుద్దవద్దు. కొందరు నాలుగు గంటలు కుటుంబానికి సమయం వెచ్చించి ఆనందాన్ని పొందుతారు. మరొకరి ఆలోచన వేరేలా ఉంటుంది. అది వారి బాలెన్స్‌. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కేవలం పనిలోనే నిమగ్నమైపోతే భార్య పారిపోతుంది. వాస్తవానికి మీకు నచ్చిన పనులు చేస్తే మీ జీవితంలో సమతుల్యత ఉంటుంది. కుటుంబం, ఉద్యోగం ఇవే మనకు ప్రపంచం. పిల్లలు కూడా మన నుంచి ఇవే విషయాలు గమనించి, ఆచరిస్తుంటారు. ఇక్కడ ఎవరూ శాశ్వతంగా ఉండిపోవడానికి రాలేదు. ఆ విషయం అర్థమైనప్పుడు మన జీవితం సరళంగా మారుతుంది" అని గౌతమ్​ అదానీ అన్నారు.

భిన్న స్వరాలు
గతంలో ఓ పాడ్‌కాస్ట్‌లో ఇన్ఫోసిస్​ నారాయణమూర్తి మాట్లాడుతూ, ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువని అన్నారు. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో, మనమూ అలాగే పనిచేయాలని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని సూచించారు. దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు ఉద్యోగ జీవితంలో ఉండే ఇబ్బందులను లేవనెత్తగా, మరికొందరు బాస్‌లు మాత్రం నారాయణ మూర్తి అభిప్రాయాన్ని స్వాగతించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.