తెలంగాణ

telangana

ETV Bharat / business

మీ పేరున బోలెడు సిమ్ కార్డులు ఉన్నాయా? రూ.2 లక్షలు పెనాల్టీ, జైలు శిక్ష ఖాయం! - SIM Card Limit Per Person In India

New SIM Card Rules In India : కొత్త టెలికమ్యునికేషన్ యాక్ట్​ -2023 ప్రకారం, ఒక వ్యక్తి దగ్గర 9 సిమ్ కార్డులే ఉండాలి. (కొన్ని ప్రాంతాల్లో మాత్రం 6 సిమ్ కార్డులే ఉండాలి.) ఈ పరిమితికి మించి సిమ్ కార్డులు కలిగి ఉంటే, గరిష్ఠంగా రూ.2 లక్షల పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో మూడేళ్ల జైలు శిక్ష కూడా పడవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం.

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 1:49 PM IST

HOW TO CHECK How many SIM cards in my name
How many SIM card can I buy in India with Aadhar card (ANI)

New SIM Card Rules In India :మీ పేరుపై చాలా సిమ్ కార్డులు తీసుకున్నారా? అయితే మీరు సమస్యల్లో పడే అవకాశం ఉంది. టెలికమ్యునికేషన్ యాక్ట్​-2023 ప్రకారం, ఒక వ్యక్తి వద్ద గరిష్ఠంగా 9 సిమ్ కార్డులు మాత్రమే ఉండాలి. జమ్ము కశ్మీర్​, అసోం, నార్త్​ఈస్ట్​ లైసెన్స్​డ్​ సర్వీస్​ ఏరియా(LSAs)ల్లో అయితే ఒక వ్యక్తి పేరుపై గరిష్ఠంగా 6 సిమ్ కార్డులే ఉండాలి. ఈ రూల్​ 2024 జూన్ 26 నుంచే అమల్లోకి వచ్చింది. ఒకవేళ ఈ పరిమితికి మించి మీరు సిమ్​ కార్డులు కలిగి ఉంటే పెనాల్టీతోపాటు, జైలు శిక్షలు కూడా పడే అవకాశం ఉంది.

పెనాల్టీలు ఎలా ఉంటాయంటే?

  • మీ దగ్గర పరిమితికి మించి సిమ్ కార్డులు ఉంటే, మొదటిసారి రూ.50,000 వరకు పెనాల్టీ విధిస్తారు.
  • ఒకవేళ మీరు మళ్లీ ఇదే విధంగా పరిమితికి మించి సిమ్ కార్డులు తీసుకుంటే, గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు పెనాల్టీ విధిస్తారు.
  • ఫ్రాడ్​, చీటింగ్​, పర్సనేషన్ లాంటి తప్పుడు విధానాల్లో సిమ్ కార్డులు తీసుకుంటే, జరిమానాతో పాటు, గరిష్ఠంగా 3 ఏళ్ల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.

మీ పేరుపై ఇతరులు సిమ్ కార్డ్ తీసుకుంటే?
మీకు తెలియకుండా, మీ పేరుపై ఇతరులు సిమ్ కార్డు తీసుకున్నా, దానికి మీరే బాధ్యులు అవుతారు. పెనాల్టీకి, జైలు శిక్షకు గురవుతారు. అందుకే మీ పేరుపై ఎన్ని సిమ్​ కార్డులు ఉన్నాయో మీరే చెక్ చేసుకోవాలి. ఒక వేళ మీరు చీట్​ చేద్దామని అనుకున్నా కుదరదు. మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో, టెలికాం ఆపరేటర్లు చాలా సులువుగా గుర్తించగలరు. అందుకే మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవాలి.

మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో చెక్ చేసుకోండిలా!
How To Check How Many SIM Cards In My Name :మన పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో 'సంచార్ సాథి' (Sanchar Saathi) వెబ్​సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

  • ముందుగా మీరు సంచార్ సాథి వెబ్​సైట్ https://tafcop.sancharsaathi.gov.in/telecomUser/ ఓపెన్ చేయాలి.
  • మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నంబర్​, క్యాప్చా ఎంటర్ చేసి, వ్యాలిడేట్​ క్యాప్చాపై క్లిక్ చేయాలి.
  • క్యాప్​చా వ్యాలిడేట్ అవ్వగానే, మీ ఫోన్​కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి.
  • వెంటనే ఓ కొత్త వెబ్​పేజ్ ఓపెన్ అవుతుంది. దీనిలో మీ పేరుపై ఎన్ని కనెక్షన్లు (సిమ్ కార్డులు) ఉన్నాయో కనిపిస్తాయి.
  • ఈ సిమ్ కార్డుల పక్కనే Not My Number, Not Required, Required అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
  • మీకు తెలియకుండా మీ పేరుపై ఉన్న యాక్టివ్​ సిమ్​ కార్డ్​ను డిస్​కనెక్ట్ చేయడానికి Not My Numberపై క్లిక్ చేయాలి.
  • మీకు ఇకపై అవసరం లేని సిమ్​ కార్డ్​​ను డిస్​కనెక్ట్ చేయడానికి Not Requiredపై క్లిక్ చేయాలి.
  • ఒక వేళ మీరు పేరుపై, మీకు అవసరమైన సిమ్​ కార్డులే ఉంటే, అప్పుడు Requirdపై క్లిక్ చేయాలి.
  • ఒకవేళ మీరు Required ఆప్షన్​పై క్లిక్ చేయకపోయినా ఏం ఫర్వాలేదు.

ఇప్పటికే చాలా సిమ్​ కార్డులు తీసుకుని ఉంటే?
ఒక వేళ మీరు ఇప్పటికే చాలా సిమ్ కార్డులు తీసుకుని ఉంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్​ (DoT) 2021 డిసెంబర్​ 7న జారీ చేసిన సూచనల ప్రకారం, వాటిని రీ-వెరిఫికేషన్​ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ దగ్గర 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే, వాటికి కచ్చితంగా రీ-వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా వాటిని సరెండర్ చేసుకోవచ్చు. లేదా ఇతరులకు బదిలీ చేయవచ్చు. అవసరం లేదనుకుంటే వాటిని డిస్​కనెక్ట్ కూడ చేసుకోవచ్చు.

మీరు కనుక కొత్త టెలికమ్యునికేషన్ యాక్ట్​-2023 అమలులోకి రాకముందు, 9 కంటే ఎక్కువ సిమ్​లు తీసుకుని ఉంటే, నిబంధనల ప్రకారం, మీపై ఎలాంటి జరిమానాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ అవసరం లేని వాటిని వదిలించుకోవడమే మంచిది.

ఫిక్స్‌డ్ డిపాజిట్​ చేయాలా? అయితే ఈ 4 రిస్క్​లు గురించి తెలుసుకోండి! - Risks In Fixed Deposits

మీ పెట్టుబడులకు 'భరోసా+ బీమా' రెండూ కావాలా? 'యులిప్‌' పాలసీలే బెస్ట్ ఛాయిస్​! - ULIP Plan Benefits

ABOUT THE AUTHOR

...view details