తెలంగాణ

telangana

ETV Bharat / business

హ్యుందాయ్ నుంచి మరో కొత్త మోడల్​​- సూపర్ సేఫ్టీ ఫీచర్స్- ధర ఎంతంటే? - Hyundai Creta N Line Specifications

Hyundai Creta N Line Bookings Open : దక్షిణ కొరియా కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్​ మోటార్స్​ ఇండియా మార్చి 11న మరో సరికొత్త హ్యుందాయ్ క్రెటా ఎన్​ లైన్​ను లాంఛ్​ చేయనుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన బుకింగ్స్​ గురువారం నుంచి ప్రారంభమైనట్లు కంపెనీ సీఓఓ తరుణ్​ గార్గ్ తెలిపారు. మరెందుకు ఆలస్యం హ్యుందాయ్ క్రెటా ఎన్​ లైన్ గురించి తెలుసుకుందాం.

Hyundai Creta N Line Bookings Open
Hyundai Creta N Line Bookings Open

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 6:06 PM IST

Hyundai Creta N Line Bookings Open : ప్రముఖ ఆటోమొబైల్స్​ తయారీ సంస్థ హ్యుందాయ్​ మోటార్స్​ ఇండియా త్వరలో భారత్​లో లాంఛ్​ చేయనున్న హ్యుందాయ్ క్రెటా ఎన్​ లైన్​కు సంబంధించిన బుకింగ్స్​ ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆ సంస్థ సీఓఓ తరుణ్​ గార్గ్​ వెల్లడించారు. కాగా, కంపెనీ అధికారిక వెబ్​సైట్​ లేదా డీలర్ల వద్ద దీనికి సంబంధించిన బుకింగ్స్​ చేసుకోవచ్చు.​ రూ.25,000లను చెల్లించి బుక్​ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన ఫొటోలను కూడా ఆయన గురువారం విడుదల చేశారు.

హ్యుందాయ్​ తీసుకురానున్న సరికొత్త ఎస్​యూవీ క్రెటా ఎన్​ లైన్​ను మార్చి 11న భారత విపణిలోకి విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో అడ్వాన్స్​డ్​ ఫీచర్స్​ అండ్​ టెక్నాలజీ పరంగా సరికొత్త మార్పులు చేసుకొని వస్తున్న ఈ కొత్త కారుకు సంబంధించిన స్పెక్స్​ అండ్​ ఫీచర్స్ వివరాలు మీ కోసం.

స్పెక్స్​ అండ్​ ఫీచర్స్​

  • 42 స్టాండర్డ్​ సేఫ్టీ ఫీచర్స్​
  • 6 ఎయిర్​బ్యాగులు
  • లెవెల్​ 2 ADAS
  • ఎలక్ట్రానిక్​ స్టెబిలిటీ కంట్రోల్​
  • ఆటో హోల్డ్​తో ఎలక్ట్రానిక్​ పార్కింగ్​ బ్రేక్​
  • హిల్​ అసిస్ట్​ కంట్రోల్​
  • లార్జ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టమ్​
  • వైర్​లెస్​ స్మార్ట్​ఫోన్​ ఛార్జర్​
  • ఆల్​-డిజిటల్​ ఇన్​స్ట్రూమెంట్​ క్లస్టర్​

మెకానికల్ అప్​డేట్స్​
ఈ హ్యుందాయ్​ క్రెటా ఎన్​ లైన్​​ కారులో డ్రైవింగ్ ఎక్స్​పీరియన్స్​​ను మరింత పెంచడానికి అనేక మెకానికల్​ అప్​డేట్స్​ను తీసుకువచ్చింది కంపెనీ. అప్​డేటెడ్​ స్టీరింగ్​​, స్పోర్టియర్​ ఎగ్జాస్ట్​ సహా ట్యూన్డ్​ సస్పెన్షన్​ను దీనిలో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పలు కాస్మొటిక్ అప్​డేట్స్​ను ఇంట్రడ్యూస్​ చేశారు.

హ్యుందాయ్​ క్రెటా ఎన్​ లైన్ విశేషాలు

  • హ్యుందాయ్​ క్రెటా ఎన్​ లైన్ 1.5 లీటర్​ 4-సిలిండర్​ టర్బో పెట్రోల్ ఇంజిన్​తో వస్తుంది.
  • దీంట్లోని ఇంజిన్​కు 7-స్పీడ్ డ్యూయెల్​ క్లచ్​ ట్రాన్స్​మిషన్​ను అనుసంధానం చేశారు.
  • ఇది 158 bhp పవర్​తో​, 253 Nm టార్క్​ను జనరేట్​ చేస్తుంది.
  • ఇందులో 6-స్పీడ్​ యూనిట్​ గేర్​ బాక్స్​, 7-స్పీడ్​ డీసీటీ ఉన్నాయి.
  • హ్యుందాయ్​ క్రెటా ఎన్​ లైన్ కారు 6-స్పీడ్​ మాన్యువల్​ గేర్​బాక్స్ ఆప్షన్​తో వస్తుంది​.
  • హ్యుందాయ్​ క్రెటా ఎన్​ లైన్ కార్​ బంపర్లను మార్చారు. రెగ్యులర్ క్రెటాలో 17 అంగుళాల వీల్స్ ఉంటే, ఈ అప్​డేటెడ్​ క్రెటా వెర్షన్​లో 18 అంగుళాల​ అల్లాయ్​ వీల్స్​ను అమర్చారు.
  • ఎన్​లైన్​ బ్యాడ్జింగ్​, స్పోర్టీ ఆప్పీల్​ను పెంచడానికి సీట్లపై కాంట్రాస్ట్​ రెడ్​ స్టిచింగ్​ను చూడవచ్చు. గేర్​ లివర్​ను కూడా ఏర్పాటు చేశారు.

Hyundai Creta N Line Price : రెగ్యులర్​ హ్యుందాయ్​ క్రెటా కారు కంటే ఈ అప్​డేటెడ్​ వెర్షన్ హ్యుందాయ్​ క్రెటా ఎన్​ లైన్​ ధర రూ.50,000 నుంచి రూ.60,000 ఎక్కువగా ఉండవచ్చని ఆటోమొబైల్​ నిపుణులు అంచనా వేస్తున్నారు.

బ్యాంక్​ ఉద్యోగులకు గుడ్​న్యూస్​- ఇకపై వారానికి 5 రోజులే పని!- శాలరీ హైక్!!​

హ్యుందాయ్ క్రెటా ఎన్​ లైన్​ లాంఛ్ డేట్​ ఫిక్స్డ్​ - కియా & టయోటా కార్స్​ రీకాల్​ - ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details