ETV Bharat / business

నయా స్కామ్​- మీ అకౌంట్​లో ఫ్రీగా రూ.5వేలు డిపాజిట్​- ఆనందంతో క్లిక్ చేస్తే అంతా ఖాళీ! - JUMPED DEPOSIT SCAM

రెచ్చిపోతున్న సైబర్ మోసగాళ్లు- జంప్డ్ డిపాజిట్ స్కామ్​తో భారీగా నగదు కొల్లగొడుతున్న కేటుగాళ్లు

Jumped Deposit Scam
Jumped Deposit Scam (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2025, 2:37 PM IST

Jumped Deposit Scam : సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. సెకన్ల వ్యవధిలో ప్రజల డబ్బును దోచుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. తాజాగా యూపీఏ యూజర్లే లక్ష్యంగా 'జంప్డ్ డిపాజిట్ స్కామ్'కు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో 'జంప్డ్ డిపాజిట్ స్కామ్' అంటే ఏమిటి? దీనిని ఎదుర్కొవడం ఎలా? తదితర విషయాలు తెలుసుకుందాం.

'జంప్డ్ డిపాజిట్ స్కామ్' అంటే ఏమిటి?
'జంప్డ్ డిపాజిట్ స్కామ్ అనేది యూపీఐ ద్వారా మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకునే మోసపూరిత స్కామ్. ఈ స్కామ్​లో భాగంగా మోసగాడు తన నంబరును ఉపయోగించి బాధితుడి ఖాతాల్లో రూ.5 వేలు, అంతకంటే తక్కువ జమ చేస్తాడు. ఆ తర్వాత మీరు కొంత డబ్బు అందుకున్నారంటూ ఫోన్​లో సందేశం పంపించి, కింద లింక్‌ పంపిస్తాడు. సాధారణంగా ఎస్ఎంఎస్​ను ఓపెన్ చేసి, యూపీఐ పిన్‌ నమోదు చేస్తాం. ఆ క్షణమే మోసగాళ్లకు మన ఖాతాలో ఉపసంహరణ అభ్యర్థనను ధ్రువీకరించినట్లే. ఆ తర్వాత ఖాతా అతనికి యాక్సెస్‌ అవుతుంది. ఆ మోసగాడు స్వయంగా ఆ ఖాతాలోని డబ్బును యజమానిలా అధికారికంగా విత్‌ డ్రా చేసుకుంటాడు. ఖాతాలో గుర్తు తెలియని నంబర్ల ద్వారా చిన్న మొత్తాలు జమ అయ్యాయంటే మోసమని గ్రహించాలి.

జాగ్రత్త సుమా!
మీకు తెలియని యూపీఐ నంబర్ల నుంచి డిపాజిట్లు స్వీకరించినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. లేదంటే మీ ఖాతాలో ఉన్న సొమ్మును సైబర్ మోసగాళ్లు కొల్లగొడతారని తెలిపారు. జంప్డ్ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే పలు చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు.

'జంప్డ్ డిపాజిట్ స్కామ్'కు అడ్డుకట్ట వేయడం ఎలా?

  • 'జంప్డ్ డిపాజిట్ స్కామ్' పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. మీకు గుర్తు తెలియని నంబర్ల ద్వారా చిన్న మొత్తాలు జమ అయినప్పుడు జాగ్రత్త అవసరం. మీ ఖాతాలో డబ్బులు జమ అయినట్టు మెసేజ్ రాగానే బ్యాలెన్స్​ను చెక్ చేసుకోవద్దు.
  • అనుమానాస్పద నోటిఫికేషన్‌ లేదా ఎస్ఎంఎస్ వచ్చినట్లు గుర్తిస్తే కనీసం 15-30 నిమిషాల వరకు యూపీఐ వాడకుండా జాగ్రత్త పడాలి. ఇలా చేస్తే, డబ్బు విత్‌ డ్రా కోసం సైబర్‌ కేటుగాళ్లు పంపిన రిక్వెస్ట్‌ కాల పరిమితి ముగుస్తుంది.
  • ఏదైనా గుర్తు తెలియని నంబరు నుంచి మీ అకౌంట్ కు డబ్బులు వస్తే ఈ విషయం కూడా గుర్తు పెట్టుకోండి. బ్యాలెన్స్‌ ను చెక్‌ చేయడానికి ముందు మీ వాస్తవ పిన్‌ నంబరు నమోదు చేయకుండా తప్పుడు నంబరు ఎంటర్ చేయండి. ఇలా చేస్తే, సైబర్‌ కేటుగాళ్ల విత్‌ డ్రా రిక్వెస్ట్‌ రద్దు అవుతుంది. దీంతో సైబర్ మోసగాడి ప్రయత్నానికి అడ్డుకట్ట పడుతుంది. ఆ తర్వాత నిజమైన పిన్‌ నంబరుతో బ్యాలెన్స్‌ ను తనిఖీ చేసుకోండి.
  • యాప్ నోటిఫికేషన్లు లేదా తెలియని నంబర్లు నుంచి మెసేజ్​లు వచ్చినప్పుడు మీరు నేరుగా బ్యాంక్​ను సంప్రదించండి. అప్పుడు మీకు డబ్బులు పంపిన ఖాతా ప్రామాణీకత ఏంటో తెలిసిపోతుంది.
  • అలాగే మీ యూపీఏ పిన్​ను ఇతరులకు షేర్ చేయవద్దు. దాన్ని గోప్యంగా ఉంచుకోండి.

ఇలాంటి చిట్కాలను పాటిస్తే జంప్డ్ డిపాజిట్ స్కామ్ బారిన పడకుండా ఉండొచ్చు. ఒకవేళ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయండి. అలాగే మీకు ఖాతా ఉన్న బ్యాంకుకు జరిగిన విషయాన్ని తెలియజేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.