ETV Bharat / spiritual

ఒకే వేదికపై ముగ్గురు అవతార మూర్తులు- గుడిలో అరుదైన గోదాదేవి విగ్రహం- ఎక్కడో తెలుసా? - BURUGU GADDA GODA DEVI

బూరుగు గడ్డ వేణుగోపాల స్వామి ఆలయంలో అరుదైన గోదాదేవి విగ్రహం - అమ్మవారి విశిష్టతలు మీ కోసం!

Goda Devi
Goda Devi (Getty Image)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2025, 4:38 AM IST

Burugu Gadda Venugopala Swamy Temple : ఆలయాలలో ధనుర్మాసం సందడి మొదలైంది. ధనుర్మాసంలో ఆలయాలలో తెల్లవారుజామున జరిగే తిరుప్పావై ఎంతో వేడుకగా ఉంటుంది. ఈ మాసంలో గోదాదేవిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. దక్షిణాదిన మాత్రమే గోదాదేవి ఆలయాలను చూడవచ్చు. అయితే ఒక ఆలయంలో గోదాదేవి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ ఆలయం ఎక్కడుంది? ఆలయ విశేషాలేమిటో ఈ కథనంలో చూద్దాం.

గోదాదేవి చాలా ప్రత్యేకం
సాధారణంగా వేణుగోపాల స్వామి ఆలయంలో గోదాదేవి అమ్మవారు కొలువై కనిపిస్తారు. వేణుగోపాలస్వామి వారితో కలిసి గర్భాలయంలో గానీ, ఉపాలయాల్లోగాని అమ్మవారు దర్శనమిస్తారు ఉంటారు. అమ్మవారు ప్రత్యేక ఆలయంలో ఉన్నప్పుడు స్వామివారిని దర్శించుకున్న తరువాత భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ అందుకు భిన్నంగా గోదాదేవి అమ్మవారిని దర్శించుకున్న తరువాతనే వేణుగోపాల స్వామిని దర్శించుకునే ఆనవాయితీ ఒక క్షేత్రంలో కనిపిస్తుంది.

ఒకే వేదికపై మూడు మూర్తులు
తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం పరిధిలో వెలసిన బూరుగు గడ్డ వేణుగోపాల స్వామి ఆలయం చాలా ప్రత్యేకమైనది. గర్భాలయంలో ఆది వరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాలస్వామి దర్శనమిస్తుంటారు. ఒకే వేదికపై ఈ మూడు మూర్తులు ఉన్నప్పటికీ, వేణుగోపాలస్వామి ప్రధాన దైవంగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. గర్భాలయంలో వేణు గోపాలుడు కుదురైన ఆకారంలో కనిపిస్తాడు.

అరుదైన గోదాదేవి విగ్రహం
ఈ ఆలయ ప్రాంగణంలోనే మరో ప్రత్యేక మందిరంలో గోదాదేవి అమ్మవారు కనిపిస్తుంది. గర్భాలయంలో అమ్మవారి విగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

సుందరమైన విగ్రహం
ఇక్కడి గోదాదేవి అమ్మవారి విగ్రహం చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. దాదాపు ఆరు అడుగుల ఎత్తును కలిగి ఉండే గోదాదేవి అమ్మవారి మూర్తి చూడగానే ఆధ్యాత్మిక భావంతో మనసు పులకరిస్తుంది. అమ్మవారి కనుముక్కు తీరు చూడ ముచ్చటగా కోల కళ్లు, అందమైన ముక్కుతో ఎంతో రమ్యంగా ఉంటుంది. సాధారణంగా గోదాదేవి కొప్పు విలక్షణంగా ఉంటుంది. ఈ కొప్పుతోనే అమ్మవారిని గోదాదేవిగా గుర్తించవచ్చు. ఇక్కడి గోదాదేవి విగ్రహానికి ఉన్న కొప్పు కూడా సౌందర్యవంతంగా ఉంటుంది. సాధారణంగా అమ్మవారి మూర్తి ఇంత ఎత్తుగా ఉండటం చాలా అరుదు.

స్వయంభువు
ఈ గోదాదేవి స్వయంభువుగా వెలిసిందని ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. ఆలయ నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఈ మూర్తి తవ్వకాల్లో బయటపడింది.

బూరుగు గడ్డ పేరు ఇందుకే
పూర్వం భృగు మహర్షి తపస్సు చేసుకున్న ప్రదేశం కావడం వల్ల, ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చిందని అంటారు.

ఆలయ సంప్రదాయం
గోదాదేవి అమ్మవారిని ముందుగా దర్శించుకున్న తరువాతనే ప్రధాన ఆలయంలోని మూర్తులను దర్శించుకోవాలనే ఒక నియమం ఇక్కడ కనిపిస్తుంది.

పూజలు ఉత్సవాలు
గర్భాలయంలో వేణుగోపాల స్వామి ఉండటం వల్ల ధనుర్మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు సేవలు జరుగుతాయి. ఇక భోగి పండుగ రోజు జరిగే గోదాదేవి కల్యాణోత్సవాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ‘కృష్ణాష్టమి’ వేడుక కూడా ఇక్కడ కనుల పండుగగా జరుగుతుంది. ఆలయంలో కుదురుగా అనిపించే కృష్ణుని దివ్య మంగళ రూపాన్ని చూసి తీరవలసిందే.

ఆకట్టుకునే ఆళ్వారుల విగ్రహాలు
సాధారణంగా ఆయా వైష్ణవ క్షేత్రాల్లో 12 మంది ఆళ్వారుల మూర్తులు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ ఈ క్షేత్రంలోని ఆళ్వారులు వరుసగా భోజనానికి కూర్చున్నట్టుగా ఉంటారు. నిజంగా ఆళ్వారులు అక్కడ సజీవంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది.

సూర్య చంద్ర పుష్కరిణులు
ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ఉపయోగించే తీర్థంగా 'సూర్య పుష్కరిణి' ఉంటే, ఆలయం లోపల ఉన్న 'చంద్రపుష్కరిణి'లోని నీటిని స్వామి వారి కైంకర్యాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు.

ముచ్చట గొలిపే మూర్తులు ఎంత చూసినా తనివి తీరదు
ఈ క్షేత్రంలోని మూర్తులన్నీ కూడా నలుపు, తేనె రంగు కలిసి రాతిలో మలచబడ్డాయి. ప్రతి మూర్తిలోను జీవం తొణికిసలాడుతూ ఉంటుంది. ఈ మూర్తుల కనుముక్కు తీరు చూస్తే ముచ్చట కలుగుతుంది. ఇంతటి అందమైన మూర్తులు ఈ ప్రాంతంలో ఇంతవరకూ చూడలేదు అనిపిస్తుంది. అంతగా దేవతా మూర్తులు కళకళలాడుతూ కనుల పండుగ చేస్తుంటాయి.

దర్శనఫలం
ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలుగొందుతున్న ఈ ఆలయంలోని వేణు గోపాల స్వామి దర్శన భాగ్యం వల్ల సంతానం కలుగుతుందనీ, శ్రీ భూ ఆదివరాహ స్వామి దర్శనం వల్ల భూ వివాదాలు తొలగిపోతాయని, లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం వల్ల గ్రహపీడలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం. ఇక గోదాదేవి దర్శనంతో అవివాహితులకు కళ్యాణ యోగం కలుగుతుందని నమ్ముతారు. ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలుగొందుతున్న ఈ ఆలయాన్ని ఈ ధనుర్మాసంలో మనం కూడా దర్శించుకుందాం. ఆధ్యాత్మిక అనుభూతిని పొందుదాం. జై శ్రీమన్నారాయణ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

గోపురం ఉండదు, పంతులు ఉండరు- స్వయంభువు అమ్మవారిని స్వయంగా పూజ చేసే ఛాన్స్!

ఏటా పెరిగే గణపతి - చెవిలో కోరికలు చెబితే చాలు - అనుకున్నది జరగడం ఖాయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.