తెలంగాణ

telangana

ETV Bharat / business

నకిలీ జీఎస్టీ బిల్లులను ఎలా గుర్తించాలి? ఎలా రిపోర్ట్ చేయాలి? - How To Identify A Fake GST Bill - HOW TO IDENTIFY A FAKE GST BILL

How To Identify A Fake GST Bill : కొంత మంది వ్యాపారులు నకిలీ జీఎస్టీ బిల్లులు ఇచ్చి వినియోగదారులను మోసగిస్తున్నారు. కనుక ఫేక్ జీఎస్టీ బిల్లుల విషయంలో కస్టమర్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. అందుకే ఈ ఆర్టికల్​లో నకిలీ జీఎస్టీ బిల్లులను ఎలా గుర్తించాలి? దాని గురించి అధికారులకు ఎలా రిపోర్ట్ చేయాలి? అనే విషయాలను తెలుసుకుందాం.

HOW TO REPORT ON A FAKE GST BILL
How To Identify A Fake GST Bill

By ETV Bharat Telugu Team

Published : Apr 1, 2024, 1:59 PM IST

How To Identify A Fake GST Bill : కేంద్ర ప్రభుత్వం 2017లో జీఎస్టీ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే నేటికీ చాలా చోట్ల జీఎస్టీ ఎగవేత, నకిలీ బిల్లుల ఉదంతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. జీఎస్టీ మోసాల్లో ఎక్కువ భాగం ఫేక్ ఇన్‌వాయిస్​ల ద్వారానే జరుగుతున్నాయి. కనుక వినియోగదారులు ఈ నకిలీ జీఎస్టీ బిల్లుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అందుకే ఇప్పుడు ఫేక్ జీఎస్టీ బిల్లులను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

జీఎస్టీ ఇన్‌వాయిస్ అంటే ఏమిటి?
మొదట జీఎస్టీ ఇన్‌వాయిస్ అంటే ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. జీఎస్టీ ఇన్‌వాయిస్ అనేది ఒక రకమైన బిల్లు. ఉదాహరణకు, మీరు వస్తువులను కొనుగోలు చేసినా లేదా సేవలను పొందినా, సదరు ప్రొడక్ట్స్​ లేదా సర్వీసెస్​ అందించిన వ్యక్తికి లేదా సంస్థకు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. సదరు బిల్లులో సరఫరాదారు పేరు, ఉత్పత్తి సమాచారం, కొనుగోలు తేదీ, డిస్కౌంట్​, ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను వివరాలు ఉంటాయి.

అయితే జీఎస్టీ పేరుతో వినియోగదారులకు నకిలీ బిల్లులు ఇస్తున్న ఉదంతాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొంతమంది వ్యాపారులు తమ బిల్లులపై GSTIN అంటే GST గుర్తింపు సంఖ్యకు బదులుగా VAT/TIN, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ నంబర్‌లను చూపిస్తున్నారు. మరికొందరు ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్స్ కట్టకుండానే, ఫేక్​​ జీఎస్టీ బిల్లులు చూపించి వినియోగదారుల నుంచి అక్రమ పద్ధతిలో డబ్బులు వసూలు చేస్తున్నారు.

నకిలీ జీఎస్టీని గుర్తించడం ఎలా?

How To Verify The GSTIN : వస్తు, సేవలు అందించే వ్యక్తులకు లేదా సంస్థలకు ప్రత్యేకమైన 15 అంకెల GSTINను కేటాయిస్తారు. ఇందులో మొదటి రెండు అంకెలు రాష్ట్ర కోడ్, తర్వాత 10 అంకెలు విక్రేత లేదా సరఫదారుని పాన్ నంబర్ (PAN) ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటాయి. 13వ అంకె పాన్ హోల్డర్ యూనిట్ నంబర్, 14వ అంకె జెడ్ అక్షరంతో, చివరిగా 'చెక్‌సమ్ అంకె' ఉంటుంది. కనుక మీకు సప్లయిర్​ బిల్లు ఇచ్చిన వెంటనే, అందులోని GSTIN (వస్తు, సేవల పన్ను గుర్తింపు సంఖ్య)ని చెక్ చేయాలి. జీఎస్టీ పోర్టల్​లో దానిని ఎంటర్ చేయాలి. ఒక వేళ సదరు GSTIN సరైనదే అయితే, జీఎస్టీ పోర్టల్​లో పన్ను చెల్లింపుదారు రకం, రిజిస్ట్రేషన్ తేదీ, రిజిస్ట్రేషన్ స్థానం (రాష్ట్రం), చట్టపరమైన పేరు, వ్యాపారం, వాణిజ్యం పేరు, UIN లేదా GSTIN స్టేటస్ కనిపిస్తాయి.

How To Check Invoice Number :మీకు ఇచ్చిన బిల్లులోని ఇన్​వాయిస్ నంబర్​, తేదీలను కూడా చెక్ చేయాలి. ఈ ఇన్​వాయిస్ నంబర్​ యూనిక్​గా, వరుస క్రమంలో ఉండాలి. మరీ ముఖ్యంగా మీరు వస్తు, సేవలు కొన్న నిర్ణీత సమయం (టైమ్) కూడా దానిలో నమోదై ఉండాలి.

How To Check Invoice Value And Tax Amount :జీఎస్టీ బిల్లులో మీరు కొనుగోలు చేసిన వస్తు, సేవల విలువ, దానిపై విధించిన పన్ను మొత్తం ఉంటుంది. కనుక మీరు జీఎస్టీ వెబ్​సైట్​లోని కాలిక్యూలేటర్ ఓపెన్ చేసి, ఇన్​వాయిస్​లోని డబ్బులకు, సరిపడా జీఎస్టీ వేశారా? లేదా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారా? అనేది చెక్ చేసుకోవాలి. అలాగే జీఎస్టీ బిల్లులో సప్లయర్ లేదా అతని అధీకృత ప్రతినిధి సంతకం ఉండాలి. బిల్లుపై కనిపించే ఆ సంతకం జీఎస్టీ పోర్టల్​లో ఉన్న సంతకంతో సరిపోలాలి.

కస్టమర్లు GST పోర్టల్‌లోని సప్లయర్​ టాక్స్ పేమెంట్ స్టేటస్​ను కూడా చెక్ చేయవచ్చు. ఒక వేళ జీఎస్టీ పోర్టల్​లో సదరు సప్లయర్​ వివరాలు కనిపించలేదంటే, అతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడని తెలుసుకోండి.

How To Report On Fake GST Bill :మీరు కనుక నకిలీ జీఎస్టీ బిల్లును గుర్తించినట్లు అయితే, నేరుగా జీఎస్టీ పోర్టల్​లోనే ఫిర్యాదు చేయవచ్చు. లేదా పోర్టల్​లోని టోల్​-ఫ్రీ నంబర్​కు ఫోన్ చేసి రిపోర్ట్ చేయవచ్చు.

'సోషల్​ మీడియాలో తప్పుడు ప్రచారం - కొత్త పన్ను విధానంలో నో ఛేంజ్​!' - కేంద్రం క్లారిటీ - New Tax Regime

2024 ఏప్రిల్ నెలలోని బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే! - Bank Holidays In April 2024

ABOUT THE AUTHOR

...view details