Used Car Selling Tips : మీ పాత కారును మంచి ధరకు అమ్మేయాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. మీ పాత కారుకు మంచి ధర రావాలంటే ఏం చేయాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
- ఎక్స్టీరియర్ :ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అని అంటుంటారు. కనుక మీ కారు ఎక్స్టీరియర్ చాలా బాగుండేలా చూసుకోవాలి. అప్పుడే బయ్యర్‌కు దానిని కొనాలని అనిపిస్తుంది. అందుకే మీ కారుపై ఏమైనా గీతలు, మరకలు ఉంటే వాటిని క్లియర్ చేయాలి. అలాగే కారు హెడ్ లైట్స్ పనిచేస్తున్నాయో, లేదో చూసుకోవాలి. వీలైనంత వరకు హెడ్ లైట్స్ బాగా ఉండేలా చూసుకోవాలి. విరిగిపోయిన బల్బులు, డిమ్ బల్బులను తీసేసి, కొత్తవి ఫిట్ చేయాలి. కారుపై ఉన్న చొట్టలను కాస్త బాగు చేయాలి. అప్పుడే కారు కొనేవారికి దానిపై మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. చాలా మంది కారుకు మళ్లీ పూర్తిగా పెయింట్ వేయిస్తుంటారు. అత్యవసరమైతే తప్ప ఇలా చేయకూడదు. ఎందుకంటే పెయింట్ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక మీకు కారు అమ్మినా లాభం వచ్చే అవకాశం తగ్గుతుంది.
- ఇంటీరియర్ :కారు కొనేవాళ్లు కచ్చితంగా కారు లోపల ఎలా ఉందో చెక్ చేస్తారు. కనుక మీ కారు లోపల అన్నీ చక్కగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా మీ సీట్లు చిరిగి ఉన్నా, లేదా మాసిపోయి ఉన్నా వాటిని బాగు చేయండి. అంటే షాంపూతో కారు సీట్లను, కార్పెట్‌ను తుడవండి. స్టీరింగ్ వీల్, డాష్‌బోర్డ్‌పై ఏమైనా మరకలు, చిరుగులు ఉంటే వాటిని కూడా సరిచేయండి. ఇక ఫ్లోర్ మ్యాట్ అరిగిపోయినా, లేదా మరకలతో ఉన్నా, వాటిని వీలైనంత వరకు మార్చేయండి. కారులో ఎలాంటి దుర్వాసన రాకుండా పూర్తిగా క్లీన్ చేయాలి. దీని వల్ల కారు మంచిగా మెయింటైన్ చేసినట్లు అవుతుంది. మీ కారుకు ఎక్కువ ధర పలికే అవకాశం పెరుగుతుంది.
- మెకానికల్ ఇష్యూస్ :కారు చక్కగా స్టార్ట్ అయ్యేలా చూడాలి. క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్లను క్లీన్ చేయాలి. అప్పుడే ఏసీ బాగా పనిచేస్తుంది. మీ కారు బ్యాటరీ బాగా పాతది అయితే, కచ్చితంగా ఛార్జింగ్ సిస్టమ్ బాగుండేలా చూసుకోండి. అప్పుడే అది బాగా పనిచేస్తుంది. అలాగే కారు కొత్త ఎయిర్ఫిల్టర్లు వేయాలి. దీని వల్ల కారులోకి మంచిగా గాలి వస్తుంది. దీని వల్ల పవర్, యాక్సిలరేషన్ వాడకం తగ్గుతుంది. ఫలితంగా కారు మైలేజ్ పెరుగుతుంది.
- టైర్స్ : మీ కారు టైర్లు పూర్తిగా అరిగిపోయి ఉంటే, కొనేవాళ్లకు అది బాగా పాతది అనే భావన ఏర్పడుతుంది. కనుక వీలైనంత వరకు మంచి టైర్లు ఉండేలా చూసుకోండి.
- సర్వీసింగ్ :మీ కారును షెడ్యూల్ ప్రకారం మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలాగే ఇంజిన్ ఆయిల్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. దీని వల్ల కారు స్మూత్‌గా రన్ అవుతుంది. బయ్యర్స్‌కు కూడా కారు కొనాలనే ఆసక్తి పెరుగుతుంది.
- డాక్యుమెంట్స్ :కారు అమ్మేటప్పుడు కచ్చితంగా దానికి కావాల్సిన పత్రాలు అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. అంటే- కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, సర్వీస్ హిస్టరీ, పొల్యూషన్ సర్టిఫికెట్ ఇలా అన్ని డాక్యుమెంట్లు ఉంటే, బయ్యర్‌కు మీ నుంచి కారు కొనవచ్చనే భరోసా కలుగుతుంది.
- ధర :పాత కారు అంటేనే బాగా తక్కువ ధరకు అడుగుతుంటారు. కనుక కారు అమ్మేటప్పుడు మీరు అనుకున్న ధర కంటే కాస్త ఎక్కువగానే చెప్పాలి. దీని వల్ల బయ్యర్ మీతో బేరం చేసి, మీరు అనుకున్న ధరకే కారును కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది.
నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు మీ అవగాహన కోసం మాత్రమే. కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.