ETV Bharat / business

ప్రతిసారి మీ లోన్​ అప్లికేషన్​ రిజెక్ట్​ అవుతోందా? ఈ టిప్స్​ పాటిస్తే అంతా సెట్! - CREDIT REPORT ERRORS

మాటిమాటికీ లోన్‌ రిజెక్ట్ అవుతోందా? మీ క్రెడిట్ స్కోర్​లో ఏమైనా తప్పులు ఉన్నాయా? ఈజీగా సరిదిద్దుకోండిలా!

Credit Report Errors
Credit Report Errors (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2025, 5:07 PM IST

Updated : Jan 30, 2025, 5:16 PM IST

Credit Report Errors : సాధార‌ణంగా లోన్ అప్రూవ‌ల్ అనేది ఆ లోన్ ఇచ్చే బ్యాంకుల లేదా సంస్థల క్రెడిట్ పాల‌సీపై ఆధార‌ప‌డి ఉంటుంది. రుణ మంజూరుకు క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తారు. ఇందుకోసం ప్రధానంగా ట్రాన్స్ యూనియన్ సిబిల్ వంటి క్రెడిట్ సమాచార సంస్థలు (సిఐసిలు) అందించే క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడతారు. ఆ సంస్థ‌లు అంద‌జేసే నివేదిక‌ల్లో ఏవైనా త‌ప్పులు ఉంటే రుణం మంజూరు చేయ‌డానికి విముఖ‌త చూపిస్తారు. మరి మీ క్రెడిట్ రిపోర్ట్​లో ఏవైనా లోపాలున్నాయా? అయితే వాటిని ఎలా స‌రిదిద్దుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

అకౌంట్, త‌ప్పుడు వ్య‌క్తిగ‌త వివ‌రాలు స‌రిగా లేక‌పోవ‌డం అనేవి క్రెడిట్ నివేదికలో కనిపించే ప్రధాన లోపాలు. రుణ‌దాత‌లు సాధార‌ణంగా ఒక వ్య‌క్తి పేరు, ఫోన్ నంబ‌ర్, చిరునామా, పుట్టిన తేదీ, పాన్ నంబ‌ర్, ఉద్యోగం, ఆదాయం త‌దిత‌ర వివ‌రాలు న‌మోదు చేస్తారు. ఈ వివ‌రాల ఆధారంగానే ట్రాన్స్ యూనియన్ సిబిల్ వంటి కంపెనీలు 'క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (సీఐఆర్)'లో మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను సృష్టిస్తాయి. ఇందులో ఏవైనా లోపాలు ఉంటే అది త‌ప్పుడు క్రెడిట్ రిపోర్టు త‌యారు చేయ‌డానికి అవ‌కాశ‌ముంది.

అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే, క్ర‌మం త‌ప్ప‌కుండా మీ క్రెడిట్ నివేదిక‌ను త‌నిఖీ చేయాలి. క్రెడిట్ రిపోర్ట్ ప్ర‌తి 45 రోజులకోసారి జనరేట్ అవుతుంది. అందుకే ఆ స‌మయానుసారంగా ఏవైనా క్లరికల్, టైపోగ్రాఫికల్ తప్పులున్నాయో చెక్ చేసుకోవాలి. ఈ విషయంలో లోపాలు మీ క్రెడిట్ నివేదిక/స్కోర్‌పై ప్రతికూల ప్ర‌భావాన్ని చూపి లోన్​ అప్లికేషన్ రిజెక్ట్​ అయ్యే అవకాశాలున్నాయి.

ఈ క్రెడిట్ రిపోర్ట్ లోపాలను ఎలా సరిదిద్దవచ్చు?
క్లోజ్​ చేసిన మీ క్రెడిట్ ఖాతా, ఇప్ప‌టికీ వినియోగిస్తున్నారని లిస్టులో ఉంటే వీలైన‌తంత తొంద‌ర‌గా దాన్ని రుణ‌దాత‌కు అందించాలి. దీంతో పాటు ప్ర‌స్తుత వివ‌రాలు అందిస్తే వారు దాన్ని సీఐసీకి అప్‌డేట్ చేస్తారు. సమాచారం అందిన తర్వాత మీ ప్ర‌స్తుత స్థితితో క్రెడిట్ నివేదికలో అవసరమైన మార్పులు చేస్తుంది. మ‌న క్రెడిట్ సంస్థలు సాధారణంగా ప్రతి 30 - 45 రోజులకు ఒకసారి సిబిల్ వంటి కంపెనీలకు డేటాను సమర్పిస్తాయి. ఈ లోపు మీరు స‌రైన వివ‌రాలు అప్​డేట్ చేయ‌క‌పోవ‌తే అది సిబిల్ రికార్డులలో అలాగే ఉంటుంది. రుణదాత సమర్పించిన డేటా, రెండు నెలల కంటే పాతదిగానే ఉండి, అప్​డేట్ కాక‌పోతే మీరు సిబిల్​కు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. క్రెడిట్ ఖాతా మీది కాక‌పోయినా, సిబిల్, సీఐసీ వంటి సంస్థ‌లకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.

ఫిర్యాదు ఎలా చేయాలి?

  • స్టెప్‌-1: ముందుగా www.cibil.com లేదా సంబంధిత CICలోకి వెళ్లి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇప్పటికే అకౌంట్‌ ఉంటే, లాగిన్‌ అయి క్రెడిట్ స్కోర్‌, క్రెడిట్‌ రిపోర్టును డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • స్టెప్‌-2 : లాగిన్‌ అయిన తర్వాత 'Credit Reports' సెక్షన్‌కి వెళ్లి, 'Dispute Centre' ఆప్షన్​పై క్లిక్‌ చేసి 'Dispute an Item'ని సెలెక్ట్‌ చేసుకోవాలి.
  • స్టెప్‌-3 : మీ ఫిర్యాదుకు సంబంధించిన సెక్షన్‌ను ఎంచుకుని అక్కడ వివరాలు నమోదు చేయాలి.

ఫిర్యాదుకు సంబంధించిన ఫామ్‌ సమర్పించిన తర్వాత, CICలు రుణదాతతో ఆ సమాచారాన్ని ధ్రువీకరించుకుని ఒక నెల తర్వాత వివరాలు అప్‌డేట్‌ చేస్తారు. అయితే ఫిర్యాదు చేసేందుకు ముందుగా మీ వివరాలను పూర్తిగా చెక్​ చేసుకోవాలి. తర్వాత మీ క్రెడిట్ రిపోర్టులో ఆ అంశం ఫిర్యాదు చేసేందుకు తగినదిగా, అంగీకరించదగినదిగా ఉండాలి. రుణదాత ఆ అంశాన్ని అంగీకరిస్తే CIC సంస్థలు సరిదిద్దుతాయి. ఒకవేళ రుణదాతలు మీ ఫిర్యాదును తిరస్కరిస్తే ఆ విషయాన్ని సైతం మీకు అవి తెలియజేస్తాయి. క్రెడిట్ రిపోర్టులో ఎలాంటి మార్పులు చేయవు. తర్వాత ఆ అంశం ప్రాసెస్‌లో ఉంది అని రిపోర్టులో ప్రస్తావిస్తారు.

Last Updated : Jan 30, 2025, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.