How To Get Car Subscription : మనలో చాలా మందికి కార్లు అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ కారు కొనేంత స్తోమత వారికి ఉండదు. ఇలాంటి వారి కోసమే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తున్నాయి. వీటి ద్వారా మీకు నచ్చిన కారును నిర్దిష్ట కాలం పాటు వాడుకోవచ్చు. దీని కోసం మీరు ప్రతినెలా నిర్దిష్ట మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. ఇది ఏదో చాలా బాగుంది కదూ. మీరు కనుక కార్ లవర్ అయితే, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, నెలకో కొత్త కారులో హాయిగా తిరగవచ్చు.
డిపాజిట్ ఎంత చేయాలి?
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ కార్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తున్నాయి. మీరు ఎంచుకునే మోడల్ ఆధారంగా ఈ డిపాజిట్ మొత్తం మారుతుంది. అయితే కార్ సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి ముందుగా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లేదా డౌన్ పేమెంట్ చెల్లించాల్సి వస్తుంది. తరువాత మీరు కోరుకున్నంత కాలానికి నెలనెలా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంతే సింపుల్.
కార్ సబ్స్క్రిప్షన్ బెనిఫిట్స్!
మీకు నచ్చిన కారును సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. దీనిని మీకు నచ్చినప్పుడు వదులుకోవచ్చు కూడా. కార్ సబ్‌స్క్రైబ్ చేసుకున్న తరువాత మీకు రోడ్ సైడ్ అసిస్టెన్స్ లభిస్తుంది. మీరు ప్రస్తుతం వాడుతున్న మోడల్‌ను వదులుకొని, కొత్త మోడల్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి వీలవుతుంది.
కారు మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్, ట్యాక్స్‌లు అన్నీ మీరు చెల్లించే నెలవారీ సభ్యత్వ రుసుములోనే కవర్ అయిపోతాయి. కనుక ఎక్స్ట్రా ఫీజు కట్టాల్సిన పని ఉండదు. యూఎస్, యూరోప్‌ల్లో ఇది బాగా పాపులర్ అయ్యింది. ఇండియాలో కూడా ఈ కార్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ క్రమంగా ప్రాచుర్యం పొందుతోంది.
Car Subscription Vs Car Loan
కార్ సబ్స్క్రిప్షన్ :సింపుల్‌గా చెప్పాలంటే, కారును నెలవారీగా అద్దెకు తీసుకోవడాన్ని కార్ సబ్స్క్రిప్షన్ అని అంచారు. మీరు నెలవారీగా చెల్లించే రుసుములోనే కారు నిర్వహణ ఖర్చులు కవర్ అయిపోతాయి. మీకు అయ్యే అదనపు ఖర్చులు - పెట్రోల్/డీజిల్, క్లీనింగ్ ఛార్జీలు మాత్రమే. పైగా మీరు తక్కువ దూరాలు మాత్రమే ప్రయాణిస్తే, సబ్స్క్రిప్షన్ ఛార్జీలు కూడా బాగా తగ్గుతాయి. ఎలా అంటే, మీరు ప్రతినెలా ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తారో ముందే చెప్పి, తక్కువ ధరకే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవచ్చు. మీరు కనుక ఎలక్ట్రిక్ కారును సబ్‌స్క్రైబ్ చేసుకుంటే తెల్లని బోర్డ్‌పై నల్లని అక్షరాలతో కార్ ప్లేట్ ఇస్తారు. లేదా పచ్చని బోర్డ్‌పై తెల్లని అక్షరాలు ఉండే కార్ ప్లేట్ ఇస్తారు.