How Banks Earn Money In India :మనం రోజువారి జీవితంలో భాగంగా వివిధ బ్యాంకుల సేవల్ని ఉపయోగించుకుంటాం. మరి ఆ బ్యాంకులు డబ్బులు ఎలా సంపాదిస్తాయి? వాటి ఆదాయ వనరులు ఏంటి? అనే సందేహాలు చాలా మందిలో కలిగే ఉంటాయి. అయితే ప్రపంచంలో ఉన్న అన్ని బ్యాంకులలాగే భారతీయ బ్యాంకులు ఆదాయం కోసం వివిధ వ్యూహాలు అనుసరిస్తాయి. అందులో కొన్ని ముఖ్యమైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయ బ్యాంకులు డబ్బులు ఎలా సంపాదిస్తాయి?
- రుణాలపై వడ్డీ
రుణాలపై వడ్డీనే బ్యాంకులకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటి. వ్యక్తిగత రుణాలు, హోమ్ లేదా వ్యాపార రుణాలు తీసుకున్నవారు బ్యాంకుకు వడ్డీ చెల్లిస్తారు. - పెట్టుబడులు
ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లు, స్టాక్స్ వంటి వివిధ రకాల ఫైనాన్సియల్ ఇన్స్ట్రుమెంట్లలో బ్యాంకులు పెట్టుబడులు పెడతాయి. బ్యాంకుల మొత్తం ఆదాయానికి ఈ పెట్టుబడుల రిటర్న్స్‌తో కొంత సమకూరుతుంది. - సర్వీస్ ఛార్జీలు, ఫీజులు
అకౌంట్ మెయింటెనెన్స్, ఏటీఎమ్ వాడకం, ట్రాన్సాక్షన్ వంటి సేవలపై ఛార్జీలు, ఫీజుల ద్వారా బ్యాంకులు ఆదాయం సమకూర్చుకుంటాయి. - క్రెడిట్ కార్డు ఆపరేషన్లు
క్రెడిట్ కార్డు ఔట్‌స్టాండిగ్ బ్యాలెన్స్‌లు, వార్షిక ఫీజులు, మర్చంట్ ఫీజులు వంటి వాటి ద్వారా బ్యాంకులు డబ్బులు సంపాదిస్తాయి. - ఫారిన్ ఎక్స్ఛేంజ్ ఆపరేషన్స్
బ్యాంకులు ఫారిన్ ఎక్స్ఛేంజ్ కార్యకలాపాలు నిర్వహిస్తాయి. కరెన్సీ కన్వెర్షన్, అంతర్జాతీయ ఫైనాన్సియల్ సేవలు బ్యాంకుల ఆదాయ వనరుల్లో ఒకటి. - ఇంటర్‌బ్యాంక్ లెండింగ్
బ్యాంకులు ఒకదానికి ఒకటి డబ్బు అప్పు ఇచ్చుకుంటాయి. ఇలాంటి ఇంటర్ బ్యాంకు ట్రాన్సాక్షన్లపై వడ్డీ రూపంలో కూడా బ్యాంకులకు ఆదాయం వస్తుంది. - ట్రెజరీ ఆపరేషన్స్
బ్యాంకులు తమ ట్రెజరీ ఆపరేషన్స్‌ను నిర్వహిస్తుంటాయి. అందులో భాగంగా ప్రభుత్వ సెక్యురిటీలు, బాండ్లు, స్టాక్స్ వంటి వివిధ రకాల ఫైనాన్సియల్ ఇన్స్ట్రుమెంట్లను అమ్మడం, కొనుగోలు చేస్తూ డబ్బులు సంపాదిస్తాయి. - డిజిటల్ బ్యాంకింగ్
ప్రస్తుతం డిజిటల్ బ్యాంకింగ్ విస్తృతంగా ఉపయోగంలో ఉంది. ఆన్లైన్ సేవలు, ఫిన్‌టెక్ పార్ట్నర్ షిప్‌లు, డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బ్యాంకులకు ఆదాయం సమకూరుతుంది.
భారతీయ బ్యాంకులను ఎవరు నియంత్రిస్తారు?
భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ), భారత్ మనీ మార్కెట్‌గా, బ్యాంకింగ్ రెగ్యులేటర్‌గా వ్యవహరిస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థ, బ్యాంకింగ్ విధానం, డిపాజిటర్లు/ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులను తనిఖీ చేస్తుంది. వాటిని నియంత్రిస్తుంది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 ఆర్బీఐకి ఆ అధికారాలు దాఖలు పరిచింది.