తెలంగాణ

telangana

ETV Bharat / business

గూగుల్ వాలెట్ ఇండియాలో లాంఛ్ అవుతుందా? క్లారిటీ ఇదే! - Google Wallet

Google Wallet Launch : గూగుల్ వాలెట్​ను భారత్​లో లాంఛ్ చేయనున్నట్లు వస్తున్న వార్తలపై గూగుల్ కంపెనీ క్లారిటీ ఇచ్చింది. ఇండియాలో ఇంకా గూగుల్ వాలెట్​ను ప్రారంభించలేదని స్పష్టం చేసింది. అయితే ప్లేస్టోర్​లో మాత్రం గూగుల్ వాలెట్​ అందుబాటులో ఉంది. కొంత మంది దానిని ఉపయోగిస్తున్నారు కూడా. పూర్తి వివరాలు మీ కోసం.

Google Wallet benefits
Google clarifies its Wallet app is yet to launch in India

By ETV Bharat Telugu Team

Published : Apr 23, 2024, 1:15 PM IST

Google Wallet Launch :గూగుల్ వాలెట్ గురించి బిగ్ అప్​డేట్ ఇచ్చింది గూగుల్ కంపెనీ. గత కొన్ని రోజులుగా భారత్​లో గూగుల్ వాలెట్ అందుబాటులో ఉందని, ప్లేస్టోర్ నుంచి డౌన్​లోడ్ చేసుకోవచ్చంటూ రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో గూగుల్ స్పందించింది. గూగుల్ వాలెట్​ను ఇంకా భారత్​లో లాంఛ్​ చేయలేదని స్పష్టం చేసింది.

వాడేస్తున్నారు!
గూగుల్ అధికారికంగా గూగుల్ వాలెట్​ను లాంఛ్ చేయనప్పటికీ, ప్లేస్టోర్​లో అందుబాటులో ఉంది. కొంత మంది భారత యూజర్లు ఈ వాలెట్​ వాడుతున్నారు కూడా.

Google Wallet Features :గూగుల్ వాలెట్​ ద్వారా వినియోగదారులు వారి డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లను టోకనైజ్ చేసి, కాంటాక్ట్​లెస్​ పేమెంట్స్ చేయవచ్చు. అంతేకాదు గూగుల్ వాలెట్​ ఒక డిజిటల్​ పేమెంట్ యాప్​గానూ పనిచేస్తుంది. అందువల్ల గూగుల్ వాలెట్ ఉపయోగించి, యూజర్లు ఆన్​లైన్ చెల్లింపులు చేసుకోవచ్చు. గిఫ్ట్ కార్డులు, జిమ్​ మెంబర్​షిప్​లు, ఈవెంట్ టిక్కెట్​లు, విమాన టిక్కెట్​లు మొదలైన వాటిని గూగుల్ వాలెట్​లో స్టోర్ చేసుకోవచ్చు.

ఆ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది!
గూగుల్ పే, గూగుల్ వాలెట్ రెండూ గూగుల్ కంపెనీవే. అయితే గూగుల్ వాలెట్ అనేది గూగుల్ పే కంటే చాలా భిన్నమైన యాప్​. గూగుల్ పే యాప్​తో యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. కానీ గూగుల్ వాలెట్​తో క్రెడిట్​/ డెబిట్ కార్డులు ఉపయోగించి కాంటాక్ట్​లెస్ పేమెంట్స్ చేయవచ్చు. అయితే గూగుల్ వాలెట్ అనేది నియర్-ఫీల్డ్​ కమ్యునికేషన్​ (NFC) సపోర్ట్​ ఉన్న స్మార్ట్​ఫోన్​ల్లో మాత్రమే పని చేస్తుంది. ప్రస్తుతానికి ఈ యాప్​ కొంత మంది భారతీయ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

WearOS-బేస్డ్​ స్మార్ట్‌వాచ్‌లను కలిగి ఉన్న వినియోగదారులు, గూగుల్ వాలెట్​ ఉపయోగించి, వాచ్ నుంచే నేరుగా కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ చేయవచ్చు. అలాగే కొన్ని సెలక్టెడ్​ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు కూడా గూగుల్ వాలెట్ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పాస్‌లతో పాటు వారి కార్డ్‌లను కూడా యాడ్ చేసుకోవచ్చు. జీమెయిల్ నుంచి ఆటోమేటిక్‌గా పాస్‌లను యాడ్ చేసుకునేందుకు యూజర్లకు అనుమతించే ఆప్షన్ కూడా యాప్‌లో ఉంటుంది. ప్రతి చెల్లింపును ప్రామాణీకరించడానికి బయోమెట్రిక్ ధృవీకరణను కూడా వాడుకోవచ్చు.

ప్రస్తుతం ఇండియాలో, సైడ్‌లోడ్ చేసిన గూగుల్ వాలెట్ పని చేస్తోందని ఎక్స్ (ట్విట్టర్​) వేదికగా చాలా మంది యూజర్లు చెబుతున్నారు. మీరు శాంసంగ్ యూజర్లు అయితే శాంసంగ్ వాలెట్ యాప్​ను కూడా గూగుల్ వాలెట్ మాదిరిగానే వాడుకోవచ్చు.

క్రెడిట్ కార్డ్​లు వాడుతున్నారా? ఈ అపోహలు & వాస్తవాలు గురించి తెలుసుకోండి! - Credit Card Myths

మొదటిసారి ITR ఫైల్​ చేస్తున్నారా? ఈ టిప్స్ మీ కోసమే! - ITR Filling Tips

ABOUT THE AUTHOR

...view details