తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫాస్టాగ్​ యూజర్లకు అలర్ట్​ - కేవైసీ అప్​డేట్​కు మరో 4 రోజులే ఛాన్స్! - fastag kyc update - FASTAG KYC UPDATE

FASTag Without KYC Deactivate : ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్​. మరో 4 రోజుల్లోపు మీ ఫాస్టాగ్​ కేవైసీ అప్​డేట్ చేసుకోవాలి. లేకుంటే ఏప్రిల్​ 1 నుంచి ఫాస్టాగ్​లు డీయాక్టివేట్ అయిపోతాయి. పైగా వాటిలోని బ్యాలెన్స్​ను కూడా వాడుకోలేరు. అందుకే ఈ ఆర్టికల్​లో ఫాస్టాగ్ కేవైసీ ఎలా అప్​డేట్ చేసుకోవాలో తెలుసుకుందాం.

FASTag Without KYC Deactivate
FASTag KYC Update

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 4:38 PM IST

FASTag Without KYC Deactivate :జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) మార్చి 31లోగా వాహనదారులు అందరూ తమ ఫాస్టాగ్ కేవైసీని అప్​డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. కేవైసీ అప్​డేట్​ చేయని ఫాస్టాగ్​ (FASTag)లను 2024 ఏప్రిల్​ 1 నుంచి డీయాక్టివేట్​ చేస్తామని లేదా బ్లాక్​లిస్ట్​లో చేరుస్తామని తేల్చిచెప్పింది. ఒకవేళ ఫాస్టాగ్​ కేవైసీ అప్​డేట్ చేసుకోకపోతే, సదరు​ ఖాతాలో బ్యాలెన్స్​ ఉన్నప్పటికీ, దానితో పేమెంట్స్ చేయలేరని పేర్కొంది. అందుకే ఫాస్టాగ్​ కేవైసీ ప్రక్రియను ఆన్​లైన్​లో ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆన్​లైన్​లో ఫాస్టాగ్​ కేవైసీని అప్​డేట్​ చేయడం ఎలా?

  • ముందుగా FASTag అధికారిక వెబ్‌సైట్‌ https://fastag.ihmcl.com ను ఓపెన్ చేయాలి.
  • మీ మొబైల్​ నంబర్​, ఓటీపీ సాయంతో లాగిన్​ అవ్వాలి.
  • మై ప్రొఫైల్ సెక్షన్​లోకి వెళ్లి, KYC అనే సబ్-​సెక్షన్​ను సెలెక్ట్ చేసుకోవాలి.
  • అందులో మీ ఫాస్టాగ్ కేవైసీ వివరాలు నమోదు చేయాలి.
  • వెహికల్​ రిజిస్ట్రేషన్​ సర్టిఫికేట్​, డ్రైవింగ్​ లైసెన్స్​, అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్​, ఫొటోలను అప్లోడ్ చేయాలి.
  • వివరాలు అన్నీ మరోసారి చెక్ చేసుకొని అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి.
  • 7 పని దినాల్లో మీ ఫాస్టాగ్​ కేవైసీ అప్​డేట్ ప్రక్రియ పూర్తి అవుతుంది.

ఫాస్టాగ్​ కేవైసీ స్టేటస్​ను చెక్​ చేసుకోండిలా!

  • మీ ఫాస్టాగ్​ కేవైసీ స్టేటస్​ను చెక్​ చేసుకునేందుకు
  • ముందుగా https://fastag.ihmcl.com/ వెబ్‌సైట్​ను ఓపెన్​ చేయాలి.
  • మీ వివరాలను నమోదు చేసి, పోర్టల్​లోకి లాగిన్​ అవ్వాలి.
  • అక్కడ మీకు మీ ఫాస్టాగ్​ కేవైసీ స్టేటస్​ కనిపిస్తుంది.
  • ఒకవేళ అది ఇన్​కంప్లీట్​గా ఉంటే గనుక అక్కడే కేవైసీని అప్​డేట్​ కూడా చేసుకోవచ్చు.

ఫాస్టాగ్​ను పొందండిలా!
సాధారణంగా వివిధ బ్యాంకులు ఫాస్టాగ్​లను జారీ చేస్తుంటాయి. అందువల్ల మీరు https://www.netc.org.in/request-for-netc-fastag లింక్​ను ఓపెన్​ చేయాలి. మీకు ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంక్​ను ఎంచుకోవాలి. అక్కడే ఫాస్టాగ్​ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.

ప్రస్తుతానికి యాక్సిస్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఎస్​బీఐ, కోటక్​ బ్యాంక్​లు ఫాస్టాగ్​ సేవలను అందిస్తున్నాయి. అలాగే అమెజాన్​, గూగుల్​ పే లాంటి ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్స్​లోనూ ఫాస్టాగ్​ను పొందవచ్చు. ఇక వీటిల్లోనూ ఫాస్టాగ్​ కేవైసీ ప్రాసెస్​ను పూర్తి చేసే ప్రక్రియ అందుబాటులో ఉంది. వీటి ద్వారాను కేవైసీని అప్డేట్​ చేసుకోవచ్చు. ఇందుకోసం సంబంధిత బ్యాంక్​ లేదా ప్లాట్​ఫామ్ అధికారిక వెబ్​సైట్​లోకి లాగిన్​ అవ్వాల్సి ఉంటుంది.

వన్​ వెహికిల్​- వన్​ ఫాస్టాగ్​
One Vehicle One FASTag : వన్​ వెహికల్​- వన్​ ఫాస్టాగ్​ పాలసీ ప్రకారం ఒక వాహనానికి ఒక ఫాస్టాగ్​ మాత్రమే ఉండాలి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఫాస్టాగ్​లు ఉంటే, వాటిలోని లేటెస్ట్​ దానిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని మిగతా వాటన్నింటిన్నీ డీయాక్టివేట్​ చేస్తారు. ఇక దీని రీఛార్జ్​ విషయానికి వస్తే BBPS, UPI, నెట్​బ్యాంకింగ్​ ద్వారా ఫాస్టాగ్​ను రీఛార్జ్ చేసుకోవచ్చు. చివరగా మీకు జారీ చేసే ఫాస్టాగ్​​ 5 ఏళ్ల వ్యాలిడిటీతో వస్తుంది. ఆ తర్వాత దాని వ్యాలిడిటీని పొడిగించుకోవచ్చు.

మీ ఫాస్టాగ్​ KYC పూర్తి చేశారా? లేదంటే ఖాతా బ్లాక్​ - ఇవాళే లాస్ట్ డేట్​!

పేటీఎం FASTagను డీయాక్టివేట్​ చేయాలా? రీఫండ్ కూడా కావాలా? అయితే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి!

ABOUT THE AUTHOR

...view details