PF Withdraw Rules Changed: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తమ ఖాతాదారులకు గుడ్న్యూస్ చెప్పింది. ఇక నుంచి పీఎఫ్ అకౌంట్ ఖాతాదారులు వైద్య అవసరాల కోసం ఎవరిపైనా ఆధారపడకుండా.. తమ ఖాతా నుంచి లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మార్పును సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషన్ (CPFC) కూడా ఆమోదించింది.
EPFO తాజా నిర్ణయం ఉద్యోగులకు పెద్ద ఉపశమనాన్ని అందిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ వైద్య సంబంధిత అడ్వాన్సుల ఉపసంహరణ నిబంధనలను మార్చింది. గతంలో వైద్య అవసరాల కోసం నిధి నుంచి క్లెయిమ్ పరిమితి 50 వేల రూపాయలు మాత్రమే ఉండేది. తాజాగా.. ఏప్రిల్ 16న జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఈ విత్ డ్రా పరిమితిని రూ.లక్షకు పెంచినట్లు ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. అంటే.. చందా దారులు ఇప్పుడు రూ.లక్ష విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌వో ఫారమ్ 31లోని పారా 68J కింద ఉపసంహరణ పరిమితిని రెట్టింపు చేసింది.
మీ PF బ్యాలెన్స్ తెలుసుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - How To Check PF Balance
68J నిబంధన ప్రకారం.. ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ పీఎఫ్ ఖాతా నుంచి తమ పర్సనల్, ఫ్యామిలీ సభ్యుల వైద్య చికిత్స ఖర్చుల కోసం రూ.లక్ష వరకూ విత్ డ్రా చేసుకోవచ్చు. కనీసం నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా, శస్త్రచికిత్స చేయించుకున్నా క్లెయిమ్ చేసుకోవచ్చు. క్షయ, పక్షవాతం, క్యానర్, గుండె సంబంధ వ్యాధుల చికిత్స కోసం కూడా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు.