EPF KYC Correction : మీరు ఉద్యోగుల భవిష్య నిధి (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) చందాదారులా? మీ పీఎఫ్ అకౌంట్ వివరాల్లో ఏవైనా తప్పులున్నాయా? లేదా వ్యక్తిగత వివరాలను అప్డేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే. పీఎఫ్ అకౌంట్లోని మీ వివరాలను సులువుగా ఆన్లైన్లోనే మార్చుకునే సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ తీసుకువచ్చింది.
ఇంతకు ముందు వరకు ఈపీఎఫ్ అకౌంట్లోని వివరాలను మార్చుకునేందుకు, ఉద్యోగులు తమ యజమాని ఇచ్చిన జాయింట్ డిక్లరేషన్ ఫారంను నింపి, దానిని ఈపీఎఫ్ఓ కార్యాలయంలో ఇచ్చేవారు. అయితే ఇప్పుడు అలాంటి అవసరమేమీ లేకుండా, చాలా ఈజీగా ఆన్లైన్లోనే మీ పీఎఫ్ అకౌంట్లోని వివరాలను మార్చుకోవచ్చు. ఇందుకోసం ఇటీవలే ఈపీఎఫ్ఓ 'స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)'ను విడుదల చేసింది. కనుక ఇప్పుడు ఈపీఎఫ్ చందాదారులు ఆన్లైన్లో తమకు చెందిన 11 వ్యక్తిగత వివరాలను మార్చుకోవచ్చు. అవేంటంటే?
11 EPF Parameters That You Can Change Through Online Mode :
- ఉద్యోగి పేరు
- లింగం (జెండర్)
- పుట్టిన తేదీ
- తల్లి/ తండ్రి పేరు
- సంబంధం (రిలేషన్షిప్)
- వైవాహిక స్థితి
- జాయినింగ్ డేట్
- రీజన్ ఫర్ క్విట్టింగ్
- డేట్ ఆఫ్ క్విట్టింగ్
- జాతీయత
- ఆధార్ నంబర్
How To Change EPF Details Online :ఆన్లైన్లోమీ ఈపీఎఫ్ ఖాతాలోని వివరాలు మార్చుకునేందుకు ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి.
- ముందుగా EPFO అధికారిక పోర్టల్ epfindia.gov.inను ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజ్‌లో కనిపించే services ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- స్క్రోల్ చేసి For Employees అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- తరువాత Member UAN/ online Service ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో UAN, పాస్వర్డ్, క్యాప్చా వివరాలు ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
- అప్పుడు మీ ఈపీఎఫ్ అకౌంట్ పేజ్ ఓపెన్ అవుతుంది.
- స్క్రీన్‌పై కనిపించే Manage ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- అందులో joint declaration ఆప్షన్ కనిపిస్తుంది.
- అక్కడ మీ మెంబర్ ఐడీని ఎంటర్ చేసి, మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న వివరాలను నమోదు చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్లు అన్నీ అప్లోడ్ చేసి, సబ్మిట్ చేయాలి.
- మీ రిక్వెస్ట్ కనుక యాక్సెప్ట్ అయితే, ఆ వివరాలు యజమానికి చేరుతాయి.
ఎంప్లాయర్ చేయాల్సింది ఇదే!
ఈపీఎఫ్ చందాదారుడి అభ్యర్థనను స్వీకరించిన తర్వాత యజమాని (ఎంప్లాయర్) ఈ కింది విధంగా చేయాల్సి ఉంటుంది.
- యజమాని epfindia.gov.in పోర్టల్‌లో తన ఎంప్లాయర్ ఐడీని నమోదు చేయాలి.
- మెంబర్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- అక్కడ joint declaration change రిక్వెస్ట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- యజమాని తమ రికార్డులను చెక్ చేసి ఉద్యోగి అభ్యర్థనను అంగీకరించవచ్చు లేదా తిరస్కరించొచ్చు.
- ఒకవేళ యజమాని చందాదారుడి రిక్వెస్ట్‌ను అంగీకరిస్తే, అది ఈపీఎఫ్ఓకు చేరుతుంది.
- ఈ విధంగా మీ ఈపీఎఫ్ అకౌంట్లోని వివరాలను చాలా సులువుగా ఆన్లైన్లోనే మార్చుకోవచ్చు.
RBI మన బంగారాన్ని విదేశాల్లో స్టోర్ చేస్తుంటుంది - ఎందుకో తెలుసా? - Indias Gold Reserves In Foreign
మీకు ఐటీ నోటీసులు వచ్చాయా? డోంట్ వర్రీ - అవి అసలైనవో, కాదో చెక్ చేసుకోండిలా! - How To Authenticate IT Notice