Diwali Best CNG Cars 2024 :ఈ దీపావళి సందర్భంగా కొత్త కారు మీ ఇంటికి తీసురావాలని ఆలోచిస్తున్నారా? ఏ కారు కొనాలో కచ్చితంగా తేల్చుకోలేకపోతున్నారా? అయితే ఈ స్టోరీ మీ కోసమే. మారుతీ సుజుకీ, టాటా కంపెనీలు సీఎన్సీ ఇంజిన్ ఆప్షన్‌తో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను అందిస్తున్నాయి. బడ్జెట్లో వస్తున్న హై మైలేజ్ కార్ల లిస్ట్ మీకోసం.
1. మారుతీ సుజుకీ బ్రెజా (Maruti Suzuki Brezza) :
ప్రస్తుతం ఇండియాలో ఉన్న టాప్ కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో మారుతీ సుజుకీ బ్రెజా ముందు వరుసలో ఉంటుంది. 1462 cc ఇంజిన్‌తో వస్తున్న ఈ కారు, 86.63 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 198 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఆఫ్రోడ్లోనూ ఈ కారు దూసుకెళ్తుంది. సీఎన్జీ వేరియంట్లో వస్తున్న బ్రెజా, 25.51 km/kg మైలేజ్ ఇస్తుంది. ఎక్స్ షో రూం ప్రకారం ఈ కారు ధర రూ.9.29 లక్షల నుంచి రూ.12.26 లక్షల వరకు ఉంటుంది.
2. మారుతీ సుజుకీ ఎర్టిగా (Maruti Suzuki Ertiga) :
బడ్జెట్లో ఫ్యామిలీ కారు కావాలనుకుంటున్న వారికి మారుతీ సుజుకీ ఎర్టిగా మంచి ఆప్షన్. ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తున్న ఈ 7 సీటర్ కారులో 1462 cc ఇంజిన్ అమర్చారు. ఇది 101.64 bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఎర్టిగా సీఎన్జీ వేరియంట్ కారు 20.3 km/kg మైలేజ్ ఇస్తుంది. ఇక ఈ కారు ధర(ఎక్స్ షో రూం) రూ.9.29 లక్షల నుంచి రూ.12.26 లక్షల వరకు ఉంటుంది.
3. టాటా నెక్సాన్ (Tata Nexon ) :
ఈ కేటగిరీలో మరో పాపులర్ మోడల్ టాటా నెక్సాన్. 1497 cc ఇంజిన్‌తో వస్తున్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ కారు, 750 rpmలో 113.31 bhp పవర్ ఉత్పత్రి చేస్తుంది. 208 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న టాటా నెక్సాన్ ఆఫ్ రోడ్లో కూడా దూసుకెళ్తుంది. ఐదుగురు కంఫర్ట్‌గా ఈ కారులో ప్రయాణం చేయొచ్చు. ఈ మోడల్ సీఎన్జీ వేరియంట్ 24.08 km/kg మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ధర(ఎక్స్ షో రూం) రూ. 8.99 లక్షల నుంచి రూ.14.59 లక్షల వరకు ఉంటుంది.