Digilocker And Mparivahan Mobile Apps :బైక్ మీద లేదా కారులో ప్రయాణిస్తున్నప్పుడు మెజార్టీ జనాలు.. డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ కార్డు) వంటి ఇతర పత్రాలు తమ వెంట పెట్టుకోవడం మర్చిపోతుంటారు. ఎక్కడైనా ట్రాఫిక్ పోలీసులు ఆపి డ్రైవింగ్ లైసెన్స్ చూపించమని అడిగితే అరెరే.. ఇంట్లో మర్చిపోయానే అని సమాధానం చెబుతుంటారు. ట్రాఫిక్ సిబ్బంది కన్విన్స్ కాకపోతే జరిమానా చెల్లించాల్సి వస్తుంది.
ఇలాంటి అనుభవం చాలా మంది వాహనదారులకు ఎదురవుతుంది. అయితే.. మీ స్మార్ట్‌ఫోన్‌లో కేవలం ఒక్కయాప్‌డౌన్‌లోడ్ చేసుకుంటే.. చాలు ఎటువంటి ఫిజికల్ డాక్యుమెంట్స్ మీరు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మరి.. ఆ యాప్ ఏంటో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ కార్డు) వంటి ఇతర పత్రాలు చాలా ముఖ్యమైనవి. వాహనం రోడ్డెక్కితే ఇవి తప్పకుండా వెంట ఉండాల్సిందే. కానీ.. పలు సందర్భాల్లో వాటిని ఇంట్లోనే మర్చిపోతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వాహనదారులు ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం రెండు యాప్‌లను రూపొందించింది. అవి ఒకటి 'డిజిలాకర్' (digilocker), రెండోది mParivahan యాప్. ఈ రెండు యాప్స్ కూడా వాహనాలకు సంబంధించిన పత్రాలను భద్రపరచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వీటిల్లోని డాక్యుమెంట్‌లను మీరు ట్రాఫిక్ పోలీసులకు చూపించి.. జరిమానాల నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
డిజిలాకర్, mParivahan యాప్‌లలో ఏ డాక్యుమెంట్‌లను భద్రపరచుకోవచ్చు ?
- డ్రైవింగ్ లైసెన్స్
- వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ కార్డు)
- పొల్యుషన్ సర్టిఫికెట్
- ఇన్సురెన్స్ వంటి ఇతర పత్రాలను భద్రపరచుకోవచ్చు.