How To Apply For RC Renewal : మీ బండి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC)ని త్వరలో రెన్యువల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఆర్‌సీని చాలా సింపుల్‌గా ఎలా రెన్యువల్ చేసుకోవాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
భారతదేశంలో ఒక కొత్త బండి కొన్న తరువాత దాని రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ 15 ఏళ్ల వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఆ గడువు ముగిసిన తరువాత, కచ్చితంగా ఆర్‌టీఓ కార్యాలయానికి వెళ్లి దానిని పునరుద్ధరణ (రెన్యువల్) చేసుకోవాలి. ఇలా రెన్యువల్ చేసుకున్న రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మరో 5 ఏళ్లపాటు చెల్లుబాటు అవుతుంది.
రూల్స్ ఏం చెబుతున్నాయ్?
సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం, ప్రైవేట్ వాహనాలను కచ్చితంగా 15 ఏళ్లకు ఒకసారి రీ-రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తరువాత బండి కండిషన్ బాగుంటే, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి దానిని రెన్యువల్ చేసుకోవాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ (DL)ను సైతం పునరుద్ధరించుకోవాలి. Parivahan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యువల్ చేసుకోవచ్చు. ఇందుకోసం అవసరమైన పత్రాలు అప్లోడ్ చేసి, నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. తరువాత ఆర్‌టీఓ కార్యాలయంలో స్లాట్ బుక్ చేసుకోవాలి.
మీ వెహికల్ రిజిస్ట్రేషన్ ఏ ఆర్‌టీఓ కార్యాలయం పరిధిలోకి వస్తుందో చూసుకోవాలి. ఫారమ్ 25ని సదరు ఆర్‌టీఓ కార్యాలయంలో సమర్పించాలి. మీ బండి రిజిస్ట్రేషన్ గడువు ముగియడానికి కనీసం 60 రోజుల ముందు ఈ ప్రక్రియ మొదలు పెట్టడం మంచిది. అంతేకాదు వాహనంపై చెల్లించాల్సిన పన్నులు అన్నీ ఎలాంటి బకాయిలు లేకుండా చూసుకోవాలి. అలాగే సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989లోని 81న నిబంధనలో పేర్కొన్న విధంగా రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఆర్‌సీ రెన్యూవల్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!
- ఫారమ్ 25
- పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్
- ఆర్‌సీ బుక్
- ఫిట్‌నెస్ సర్టిఫికెట్
- రోడ్ టాక్స్ పేమెంట్ రిసిప్ట్స్
- ఇన్సూరెన్స్ సర్టిఫికెట్
- పాన్ కార్డ్ లేదా ఫారమ్ 60 & ఫారమ్ 61
- ఛాసిస్ & ఇంజిన్ పెన్సిల్ ప్రింట్
- ఓనర్ సిగ్నేచర్ ఐడెంటిఫికేషన్
How To Renew Your Vehicle Registration Certificate
- ముందుగా మీరు ఫారమ్ 25 తీసుకుని, అందులో మీ వాహనం వివరాలు అన్నీ నమోదు చేయాలి.
- ఫారమ్ 25తో పాటు అవసరమైన అన్ని పత్రాలు జత చేసి ఆర్‌టీఓ కార్యాలయంలో సమర్పించాలి.
- మీ వాహనాన్ని తనిఖీ (ఇన్‌స్పెక్షన్) కోసం కచ్చితంగా ఆర్‌టీఓ కార్యాలయానికి తీసుకెళ్లాలి.
- వాహనంపై చెల్లించాల్సిన పన్నులు ఏమైనా ఉంటే, వాటన్నింటినీ కట్టేయాలి.
- నిబంధనల ప్రకారం, ఆర్‌టీఓ కార్యాలయంలో రీ-రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. అంతే సింపుల్!
- ఆర్‌టీఓ కార్యాలయం మీరు సమర్పించిన పత్రాలను పరిశీలించి, వాహనాన్ని తనిఖీ చేసి, అన్నీ సరిగ్గా ఉంటే, మీకు కొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ) జారీ చేస్తుంది.
How to Download Vehicle RC Online Telangana: ఆన్లైన్లో RCని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసా?