One Nation One Election Panel : జమిలి ఎన్నికల బిల్లుల పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని కేంద్ర ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో భాజపా తరఫున అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ తరఫున ప్రియాంకా గాంధీ తదితరులకు చోటు కల్పించినట్లు తెలిసింది. ఇందులో 21 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉండనున్నారు.
జేపీసీ ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ మంత్రి గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. జేపీసీకి లోక్‌సభ నుంచి 21 మంది సభ్యులను నియమించారు. సభ్యులుగా ప్రియాంకా గాంధీ, మనీష్ తివారీ, సుఖదేవ్ భగత్, సీఎం రమేశ్, బాలశౌరి వల్లభనేని, జీఎం హరీశ్ బాలయోగి, పురుషోత్తం రూపాల, అనురాగ్ ఠాకూర్, భర్తృ హరి మెహతాబ్, సుప్రియా సూలే, శ్రీకాంత్ షిండే, పీపీ చౌదరీ, బాన్సురీ స్వరాజ్, విష్ణుదయాళ్ రామ్, సంబిత్ పాత్రా, అనిల్ బలూనీ, విష్ణుదత్ శర్మ, ధర్మేంద్ర యాదవ్, కల్యాణ్ బెనర్జీ, టీఎం సెల్వ గణపతి, సుప్రియా సూలే, శ్రీకాంత్ శిందే, చందన్ చౌహాన్ ఉన్నారు
రాజ్యసభ నుంచి 10 మంది సభ్యుల పేర్లను ప్రతిపాదించాల్సి ఉంది. వారి పేర్లను ఖరారు చేసిన తరువాత కమిటీ ఛైర్మన్‌ను కేంద్రం ప్రకటించనుంది. తదుపరి పార్లమెంటు సమావేశాల చివరి వారంలో ఈ కమిటీ నివేదిక సమర్పించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.