ETV Bharat / state

రైల్వే టెర్మినలా? - ఇంటర్​నేషనల్​ ఎయిర్​పోర్టా! - 28న 'చర్లపల్లి' ప్రారంభం - NEW CHERLAPALLI RAILWAY TERMINAL

28న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభం - సుమారు రూ.430 కోట్ల వ్యయంతో నిర్మాణం - ప్రారంభించనున్న కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్​, కిషన్​ రెడ్డి

CHARLAPALLI RAILWAY STATION
అత్యాధునికంగా నిర్నించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Charlapalli Railway Station in Hyderabad : చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ మహానగరం హైదరాబాద్​లో అంగరంగా వైభవంగా ఆవిష్కృతం కానుంది. చర్లపల్లి అనగానే సాధారణంగా కార్మికులు రకరకాల పరిశ్రమల పేర్లు వినిపిస్తాయి. కాని ఇప్పుడు మాత్రం చర్లపల్లి అనే పేరు అత్యాధునికమైన రైల్వే స్టేషనే కదా అనేదాకా వెళ్లనుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సుమారు రూ.430 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్‌ ప్రయాణికులకు ఈ నెలాఖరకు అందుబాటులోకి రానుంది. ఈనెల (డిసెంబరు) 28న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు.

ఆధునిక సౌకర్యాలతో : ఈ చర్లపల్లి టెర్మనల్​ భవనంలో ప్రయాణికలకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఆరు ఎస్కలేటర్లు, ఏడు లిఫ్ట్‌లు, ఆరు బుకింగ్‌ కౌంటర్లు, పురుషులు, మహిళలకు వేర్వేరు వెయిటింగ్‌ హాళ్లు, హైక్లాస్‌ వెయిటింగ్‌ ఏరియా, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఎగ్జిక్యూటివ్‌ లాంజ్​లాంటివి ఎయిర్​ పోర్టలలో ఎలాగైతే ఉంటాయో అలా వసతులను నిర్మించారు. మొదటి అంతస్తులో కెఫెటేరియా, రెస్టారెంట్‌, శౌచాలయాల వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

CHARLAPALLI RAILWAY STATION
లోపలివైపు ఎయిర్​పోర్ట్​ తరహాలో హంగులు (ETV Bharat)

ఎయిర్​పోర్ట్​ తరహా హంగులు : కొత్త డిజైన్‌లో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా విశాలమైన స్థలం (కన్​కోర్స్‌), ముందువైపు ప్రకాశవంతమైన లైటింగ్‌తో కొత్తం టెక్నాలజీని ఉపయోగించి ఎలివేషన్‌ను (ముందుభాగం) తీర్చిదిద్దారు. టెర్మినల్​ మొదలైతే ప్రయాణికులకు ఉచితంగా వైఫై సదుపాయం కల్పించనున్నారు. చర్లపల్లి హైదరాబాద్‌ శివారులో ఉంది కాబట్టి ఈ టెర్మినల్‌ అందుబాటులోకి వస్తే పలు రైళ్లు ఇక్కడి నుంచే రైలు బండి కూతలతో ప్రారంభం కానున్నాయి. తద్వారా జంట నగరాల్లోని (హైదరాబాద్, సికింద్రాబాద్​) ప్రధాన రైల్వేస్టేషన్లపై ఒత్తిడి తగ్గించాలని రైల్వే శాఖ అంతిమ లక్ష్యం.

ఈ టెర్మినల్‌ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాక మహానగరంలోని సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచికూడ రైల్వే స్టేషన్‌లపై ప్రయాణికుల ఒత్తిడి గణనీయ సంఖ్యలో తగ్గిపోనుంది. చర్లపల్లి నుంచే నగరం నలుమూలలకు ప్రయాణికులు సులువుగా చేరుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు అదనంగా మరో 25 జతల ట్రైన్స్​ ఇక్కడి నుంచి పరుగులు తీయనున్నాయి. లక్షల్లో ప్రయాణికులు రాకపోకలు సాగించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజారవాణాను మెరుగు పరిచేందుకు చర్యలకు ఉపక్రమించింది.

విమానాశ్రయాన్ని తలపించే రీతిలో చర్లపల్లి రైల్వే టర్మినల్ - త్వరలో పూర్తికానున్న నిర్మాణం - Cherlapalli Terminal Railway

2026 నాటికి సరికొత్తగా సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్ - ఎలా ఉంటుందో తెలుసా? - Secunderabad Rail Station Upgrade

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.