Credit Card Withdrawing Benefits: ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నచిన్న అవసరాలకు కూడా క్రెడిట్ కార్డును వాడేస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డుల తప్పుడు వినియోగాన్ని అడ్డుకునేందుకు జారీ సంస్థలు ప్రయోజనాలను తగ్గిస్తున్నాయి. మరికొన్ని క్రెడిట్ కార్డు జారీ సంస్థలు పూర్తిగా బెనిఫిట్స్‌ను ఉపసంహరించుకుంటున్నాయి. క్రికెట్ కార్డును బెనిఫిట్స్ కోసమే తీసుకునేవారికి, దానిపై వచ్చే ప్రయోజనాలను అకస్మాత్తుగా ఉపసంహరించడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడు కస్టమర్ ముందున్న ఆప్షన్ ఏంటంటే?
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం
క్రెడిట్ కార్డును జారీ చేసే బ్యాంకులు బెనిఫిట్స్ వంటిని తగ్గించినా, ఉపసంహరించుకున్నా కస్టమర్‌కు నోటీసు ఇవ్వాలి. అలాగే ఎప్పటి నుంచి రివార్డు పాయింట్లు, బోనస్‌లపై పరిమితిని విధిస్తున్నామో క్రెడిట్ కార్డు జారీ సంస్థలు వినియోగదారుడికి తెలియజేయాలి. కాలపరిమితి స్పష్టంగా పేర్కొనాలి. నిర్ణీత గడువులోగా కస్టమర్ తన నిర్ణయాన్ని తెలియజేయకపోతే, కార్డు జారీ సంస్థ లేదా బ్యాంకు తాము చేసిన మార్పులను వినియోగదారుడు అంగీకరించినట్లుగా భావించవచ్చు. కస్టమర్‌కు నిబంధనలు నచ్చకపోతే కార్డును సరెండర్ చేయవచ్చు. క్రెడిట్ కార్డు జారీ సంస్థలు వడ్డీ కాకుండా ఇతర ఛార్జీలలో మార్పులు చేయాలనుకుంటే ఒక నెల ముందే కస్టమర్‌కు నోటీసు ఇవ్వాలి.