Driving Tips For Beginners :డ్రైవింగ్ అంటే వాహనాన్ని ఒక చోటి నుంచి మరో చోటికి తీసుకెళ్లడం కాదు, అంతకు మించి. డ్రైవింగ్ అనుకున్నంత సులభం కాదు. కారు డ్రైవింగ్ చేయాలంటే ఏకాగ్రతతోపాటు, డైరెక్షన్స్ గురించి, ట్రాఫిక్ నియమాల గురించి పూర్తి పరిజ్ఞానం ఉండాలి. అందుకే కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న వాళ్లకు, ఇప్పుడిప్పుడే సొంతంగా కారు డ్రైవింగ్ చేస్తున్నవారికి ఉపయోగపడే 6 టిప్స్ గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
1. వాహనం గురించి పూర్తిగా తెలుసుకోండి!
మీరు కారు నడపడం ప్రారంభించే ముందు, దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం. అది మాన్యువల్ అయినా, ఆటోమేటిక్ అయినా, దాని గురించి అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా కీ కంట్రోల్స్ అన్నింటి గురించి మీకు అవగాహన ఉండి తీరాలి. ఈ కీ కంట్రోల్స్ ఎక్కడుంటాయి? ఎలా ఉపయోగపడతాయి? అనే విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవాలి. లేదా కారు మాన్యువల్ని చదివాలి.
2. కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవాలి!
డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. అదే సమయంలో సౌకర్యవంతంగా కూర్చునే విషయంలోనూ రాజీ పడకూడదని గుర్తుంచుకోండి. మీరు కారును స్టార్ట్ చేసే ముందు, మీ ఎత్తు, సౌకర్యానికి అనుగుణంగా సీటును సర్దుబాటు చేసుకోండి. అన్నివైపులా ఉన్న అద్దాలు సరిచూసుకోండి.
3. పరధ్యానం వద్దు
కొందరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ వాడటమో, సాంగ్స్ వినటమో చేస్తారు. కానీ ఇది అన్ని వేళలా మందిచి కాదు. ఇలా చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశముంది. అందుకే డ్రైవింగ్ సమయంలో పరధ్యానంలో ఉండకూడదు. అది ఫోన్ అయినా, మ్యూజిక్ అయినా, మీ ఏకాగ్రతను దెబ్బతీసేది ఏదైనా, దానిని పక్కన పెట్టాలి. మీరు కొత్తగా డ్రైవింగ్ చేయడం ప్రారంభిస్తే, అందులో నిపుణత సాధించే వరకు మీ పక్కనే అనుభవజ్ఞుడైన డ్రైవర్‌ని కూర్చోబెట్టుకోవాలి.