Bikes Diwali Offers 2024 :దీపావళి, ధంతేరాస్ సందర్భంగా కొత్త బైక్ లేదా స్కూటీ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. హీరో, హోండా, టీవీఎస్ లాంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ లేటెస్ట్ బైక్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.
1. TVS iQube Diwali Offer :టీవీఎస్ కంపెనీ ఐక్యూబ్ స్కూటీపై దీపావళి ఫెస్టివల్ డిస్కౌంట్ ఇస్తోంది. మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.89,999గా ఉంది. కానీ ఈ దీపావళికి హెచ్‌డీఎఫ్‌సీ లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులతో పేమెంట్ చేస్తే ఈ టీవీఎస్ ఐక్యూబ్‌పై రూ.10,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు దీనిపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు, క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్లు, విన్ ఆఫర్స్, ఫ్లెక్లిబుల్ నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందిస్తోంది.
టీవీఎస్ మోటార్ అధికారిక వెబ్‌సైట్ నుంచి కనుక ఈ ఐక్యూబ్ స్కూటీని కొనుగోలు చేస్తే, కస్టమర్‌కు కింద ఇచ్చిన లిస్ట్‌లోని ఏదో ఒక ప్రత్యేకమైన కానుక కూడా ఇస్తారు.
- ప్రెస్టేజ్ పీజీఎంఎఫ్‌బీ 800 వాట్ గ్రిల్ శాండ్‌విచ్ టోస్టర్
- వైల్డ్‌క్రాఫ్ట్ డబ్ల్యూఎల్‌యూఎల్3 బ్యాక్‌ప్యాక్
- టెక్నోబైట్ 10000mAh పవర్‌బ్యాంక్ పాకో
- ప్రెస్టేజ్ ఈ పీఈసీ4.0 ఎలక్ట్రిక్ చాపర్
- బోట్ ఎయిర్‌డ్రాప్స్ 138 ఇయర్‌బడ్స్
- బోట్ ఆస్ట్రా వాయిస్ స్మార్ట్‌వాచ్
- డిజైనర్ హ్యాండ్‌బ్యాగ్
2. Hero Bike Festival Offers :హీరో కంపెనీ సూపర్ స్ల్పెండర్ Xtec, హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌లపై అదిరిపోయే డిస్కౌంట్స్ అందిస్తోంది. ప్రధానంగా రూ.5,500 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.5000 వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తోంది.
- మార్కెట్లో హీరో సూపర్ స్ల్పెండర్ ఎక్స్‌టెక్ బైక్ ధర రూ.85,178 - రూ.89,078 ప్రైస్ రేంజ్‌లో ఉంటుంది. ఈ దీపావళికి దీనిని కొంటే సుమారుగా రూ.10,500 వరకు ధర తగ్గుతుంది.
- మార్కెట్లో హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ ధర రూ.65,268 - రూ.70,348 ప్రైస్ రేంజ్‌లో ఉంటుంది. ఈ దీపావళికి దీనిని కొంటే రూ.10,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
3. Honda Activa 6G Diwali Offer :భారత్‌లోని మోస్ట్ పాపులర్ స్కూటీల్లో హోండా యాక్టివా 6జీ ఒకటి. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.94,000 వరకు ఉంది. కానీ ఈ దీపావళికి దీనిపై రూ.5,500 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.
4. Bajaj Pulsar 125 :మార్కెట్లో ఈ బజాబ్ పల్సర్ 125 బైక్ ధర రూ.82,883 వరకు ఉంటుంది. ఈ దీపావళికి దీనిపై రూ.10,000 డిస్కౌంట్ లభిస్తోంది.