తెలంగాణ

telangana

ETV Bharat / business

మీ బైక్ తక్కువ మైలేజ్ ఇస్తోందా? - ఈ సింపుల్ టిప్స్ పాటించారంటే ఓ రేంజ్​లో పెరగడం పక్కా! - Bike Mileage Increase Tips - BIKE MILEAGE INCREASE TIPS

Bike Mileage Increase Tips : మీ బైక్ సరైన మైలేజ్ ఇవ్వట్లేదా? లీటర్​ పెట్రోల్ పోయిస్తే 40 కిలోమీటర్లు కూడా రావట్లేదని బాధపడుతున్నారా? అయితే, ఇందుకు మీరు చేసే కొన్ని చిన్నచిన్న పొరపాట్లే కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. వాటిని సరి చేసుకున్నారంటే.. మీ బైక్ మైలేజ్ పెరగడమే కాదు ఫ్యూయల్ ఖర్చు తగ్గుతుందంటున్నారు! అవేంటో ఇప్పుడు చూద్దాం.

Bike Mileage Increase Tips
Bike Mileage

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 4:47 PM IST

Best Tips to Increase Bike Mileage :నేటి ఆధునిక యుగంలో బైక్ నిత్యావసర ప్రయాణ సాధనంలా మారిపోయింది. దాదాపు అందరి ఇళ్లలో ద్విచక్రవాహనం ఉంటుంది. ముఖ్యంగా ఈతరం యువత ఆఫీస్, కాలేజీ, ఆరు బయటకు ఎక్కడికి వెళ్లాలన్నా బైక్​లనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది బైక్ రైడింగ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. ఈ కారణంగా.. మైలేజ్ తక్కువగా వస్తుంది. దాంతో మెజార్టీ పీపుల్.. తమ ద్విచక్రవాహనం కంపెనీ చెప్పిన మైలేజ్ ఇవ్వట్లేదని, లీటర్​కు కనీసం 40 కిలోమీటర్లు కూడా రావడం లేదని వాపోతుంటారు. మీ బైక్(Bike)​ కూడా ఇలానే తక్కువ మైలేజ్ ఇస్తోందా? అయితే, మేము చెప్పే టిప్స్ ఫాలో అయ్యారంటే మీ బైక్ మైలేజ్ అమాంతం పెరగడమే కాకుండా ఇంధన ఖర్చును తగ్గిస్తుందంటున్నారు నిపుణులు. మరి, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

గేర్ షిఫ్టింగ్ : మీ బైక్ మైలేజ్ తగ్గడానికి సరైన సమయంలో గేర్లు మార్చకపోవడం ఒక కారణమని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి, మీ ద్విచక్రవాహనం మైలేజ్ తగ్గకుండా ఉండాలంటే వేగానికి తగ్గట్లు గేర్ మార్చాలి. అలాకాకుండా.. ఎక్కువ వేగంతో వెళ్లేటప్పుడు తక్కువ గేర్ ఉపయోగిస్తే అది ఇంజిన్​ పనితీరును ప్రభావితం చేయడమే కాకుండా ఎక్కువ ఫ్యూయల్​ వినియోగానికి కారణమవుతోంది. కాబట్టి, మీరు బెస్ట్ మైలేజ్​ పొందాలంటే.. స్పీడ్, రోడ్డు పరిస్థితికి అనుగుణంగా గేర్స్ ఛేంజ్ చేయాలి. అలాగే ఖాళీగా ఉన్న రోడ్లపై స్పీడ్​గా వెళ్తున్నప్పుడు టాప్ గేర్​లో, నిదానంగా వెళ్తున్నట్లయితే సెకండ్ లేదా థర్డ్​ గేర్​లో వెళ్లాలి. ఇలా వెళ్లడం వల్ల మార్గమధ్యలో బైక్ ఆగకుండా జర్నీ సాఫీగా సాగుతుందంటున్నారు నిపుణులు. అలాగే మైలేజ్​ను పెంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.

బ్రేక్‌పై కాలు పెట్టి డ్రైవ్ చేయకండి : చాలా మంది బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చేసే పొరపాటు ఏంటంటే.. బ్రేక్‌ పెడల్​పై కాలు పెట్టి డ్రైవ్ చేస్తుంటారు. అయితే, అది ఓ రకంగా మంచిదే! ఎందుకంటే ఏదైనా వెహికల్ సడన్​గా వచ్చినప్పుడు మీరు వెంటనే బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు యూజ్ అవుతుంది. కానీ, డ్రైవ్ చేసేటప్పుడు ఎప్పుడూ బ్రేక్​పై కాలు ఉంచడం వల్ల బ్రేక్​కి తేలికపాటి ఒత్తిడి కలిగి.. బైక్ మైలేజ్ తగ్గే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి, ఎప్పుడూ బ్రేక్​ పెడల్​పై కాలు పెట్టకుండా అవసరమైనప్పుడు యూజ్ చేయడం మంచిది అంటున్నారు.

మీరు మేఘాల్లో తేలిపోతుంటే - జుట్టు నేల రాలుతోందా? - ఈ టిప్స్ పాటించండి! - Hair Care Tips While Riding Bike

టైర్ల ప్రెజర్ తనిఖీ : ఎక్కువ మంది బైక్ రైడర్స్ చేసే మరో పొరపాటు ఏంటంటే.. టైర్లలో ఎయిర్ ప్రెజర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కొందరు బంక్​లో పెట్రోల్ నింపేటప్పుడు మాత్రమే టైర్లలో ఎయిర్ ప్రెజర్ చెక్ చేయిస్తుంటారు. ఇంకొందరు నెలకోసారి చెక్ చేస్తే.. మరికొందరైతే ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోరు. కానీ.. బైక్​ టైర్స్​లో సరైన ఎయిర్ ప్రెజర్ లేకపోయినా మైలేజ్​పై ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. బైక్ టైర్​లో ఉండాల్సినంత ఎయిర్ ప్రెజర్​ లేకపోతే మీరు ఎంత యాక్సిలరేట్ చేసినా వేగం పెరగదు, ఫ్యూయల్ వేస్ట్ అవుతుంది. కాబట్టి, ప్రతి రెండు రోజులకోసారి మీ టైర్ ఎయిర్ ప్రెజర్ చెక్ చేసుకోవడం ద్వారా బైక్ మైలేజ్ పెరగడమే కాకుండా ఇంధన ఖర్చు తగ్గుతుందంటున్నారు నిపుణులు.

ఇవేకాకుండా క్రమం తప్పకుండా బైక్ సర్వీసింగ్ చేయించడం, ఎయిర్ ఫిల్టర్​ను శుభ్రం చేయడం, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బైక్ ఆపడం వంటివి చేయడం కూడా మీ ద్విచక్రవాహనం మైలేజ్​ను పెంచడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు.

మీరు టూ-వీలర్స్​ నడుపుతుంటారా? ఈ టాప్​-10 రోడ్ సేఫ్టీ టిప్స్ మీ కోసమే! - Road Safety Tips For Bike Riders

ABOUT THE AUTHOR

...view details