Best Scooters Under 1 Lakh : ఇండియాలో స్కూటర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యువతీయువకుల నుంచి పెద్ద వాళ్ల వరకు, ఉద్యోగుల నుంచి డైలీ వర్కర్ల వరకు అందరూ దీనిని వాడుతున్నారు. అందుకే ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ స్కూటీలను మార్కెట్లోకి తెస్తున్నాయి. అలాంటి వాటిలో రూ.1 లక్ష బడ్జెట్లో మంచి మైలేజ్, బెస్ట్ ఫీచర్లు ఉన్న టాప్-10 స్కూటర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. Honda Activa 6G :భారత దేశంలోని మోస్ట్ పాపులర్ స్కూటీల్లో హోండా యాక్టివా 6జీ ఒకటి. మంచి లుక్‌తో, డ్రైవ్ చేయడానికి చాలా అనువుగా ఇది ఉంటుంది.
- ఇంజిన్ : 109.51 సీసీ
- పవర్ : 7.79 PS@ 8000 rpm
- టార్క్ : 8.84 Nm@ 5500 rpm
- మైలేజ్ : 50 కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 5.3 లీటర్స్
Honda Activa 6G Price :మార్కెట్లో హోండా యాక్టివా 6జీ స్కూటర్ ధర సుమారుగా రూ.76,234 - రూ.82,734 (ఎక్స్-షోరూం) ఉంటుంది. ఇది మొత్తం 5 వేరియంట్లలో లభిస్తుంది. దీనిపై పట్టణాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లోని గతుకుల రోడ్లపై కూడా హాయిగా ప్రయాణించవచ్చు.
2. Suzuki Access 125 : ఇండియాలోని టాప్-5 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లలో సుజుకి యాక్సెస్ 125 ఒకటి. దీనిలో బోలెడ్ లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. మంచి మైలేజ్ ఇచ్చే స్కూటీ కొనాలని అనుకునేవారికి ఇది మంచి ఛాయిస్ అవుతుంది. ఇది మొత్తం 4 వేరియంట్లలో, 15 అందమైన రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ : 124 సీసీ
- పవర్ : 8.7 PS@ 6750 rpm
- టార్క్ : 10 Nm@ 5500 rpm
- మైలేజ్ : 45 కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 5 లీటర్స్
Suzuki Access 125 Price : మార్కెట్లో సుజుకి యాక్సెస్ 125 స్కూటీ ధర సుమారుగా రూ.79,900 - రూ.90,500 (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది.
3. TVS NTORQ 125 : టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటీ చూడడానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఇది మంచి ఫ్యూయెల్ ఎఫీషియన్సీ ఉన్న బైక్. కాలేజ్ పిల్లలకు, మహిళలకు ఇది చాలా బాగుంటుంది. ఈ బండి మొత్తం 6 వేరియంట్లలో, 12 డిఫరెంట్ కలర్స్‌లో లభిస్తుంది.
- ఇంజిన్ : 124.8 సీసీ
- పవర్ : 9.51 PS@ 7000 rpm
- టార్క్ : 10.6 Nm@ 5500 rpm
- మైలేజ్ : 47 కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 5.8 లీటర్స్
TVS NTORQ 125 Price : మార్కెట్లో టీవీఎస్ స్కూటీ ధర సుమారుగా రూ.84,636 - రూ.1.05 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
4. Honda Activa 125 :తక్కువ బడ్జెట్లో మంచి ఎఫీషియెంట్ టూ-వీలర్ కొనాలని అనుకునేవారికి హోండా యాక్టివా 125 మంచి ఆప్షన్ అవుతుంది. అందుకే ఇది ఇండియాలో టాప్-5 బెస్ట్ సెల్లింగ్ టూ-వీలర్లలో ఒకటిగా ఉంది. ఇది 4 వేరియంట్లలో, 5 అందమైన రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ : 124 సీసీ
- పవర్ : 8.30 PS@ 6250 rpm
- టార్క్ : 10.4 Nm@ 5000 rpm
- మైలేజ్ : 60 కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 5.3 లీటర్స్
Honda Activa 125 Price :మార్కెట్లో హోండా యాక్టివా 125 స్కూటీ ధర సుమారుగా రూ.79,806 - రూ.88,979 (ఎక్స్-షోరూం) ఉంటుంది.
5. TVS Jupiter :ఒక లక్షలోపు బడ్జెట్‌తో మంచి మైలేజ్ ఇచ్చే టూ-వీలర్ కొనాలని అనుకునేవారికి టీవీఎస్ జూపిటర్ బ్రహ్మాండంగా ఉంటుంది. దీని ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ చాలా బాగుంటుంది. ఈ బండి మొత్తం 6 వేరియంట్లలో, 16 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
- ఇంజిన్ : 109.7 సీసీ
- పవర్ : 7.88 PS@ 7500 rpm
- టార్క్ : 8.8 Nm@ 5500 rpm
- మైలేజ్ : 50 కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 6 లీటర్స్
TVS Jupiter Price : మార్కెట్లో టీవీఎస్ జూపిటర్ స్కూటీ ధర సుమారుగా రూ.73,650 - రూ.90,573 (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది.