Best Mileage Cars In India Under 10 Lakh : భారతదేశంలో నేడు దొరకని కారు మోడల్ లేదంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. హ్యాచ్బ్యాక్, సెడాన్, కాంపాక్ట్ ఎస్యూవీ, ఫుల్-సైజ్ ఎస్యూవీ సహా అన్ని రకాల కార్ మోడల్స్ ఇండియాలో లభిస్తున్నాయి. అయితే ఎక్కువ మంది, తక్కువ ధరలో మంచి పెర్ఫార్మెన్స్, సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కార్లను కొనేందుకు ఇష్టపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఎక్కువ మైలేజ్ కార్లు కొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకే ఈ ఆర్టికల్లో రూ.10 లక్షల బడ్జెట్లో, మంచి మైలేజ్ ఇచ్చే టాప్-5 కార్ల గురించి తెలుసుకుందాం.
1. Maruti Suzuki WagonR : మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ అనేది ఒక హ్యాచ్బ్యాక్. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.5.52 లక్షల నుంచి రూ.7.38 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది. దీనిలోని పెట్రోల్ ఇంజిన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్తో అయితే 24.43 కి.మీ kmpl మైలేజ్ ఇస్తుంది. అదే పెట్రోల్ ఇంజిన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో 24.43 kmpl మైలేజ్ ఇస్తుంది.
2. Maruti Suzuki Dzire :ఈ మారుతి సుజుకి డిజైర్ అనేది ఒక కాంపాక్ట్ సెడాన్ కారు. ఇండియాలో దీని ధర సుమారుగా రూ.6.57 లక్షలు నుంచి రూ.9.39 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది. దీని పెట్రోల్ ఇంజిన్ ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ 26 కి.మీ/లీటర్.
3. Hyudai i20 :ఈ హ్యుందాయ్ ఐ20 అనేది ఒక హ్యాచ్బ్యాక్. దీని ధర సుమారుగా రూ.7.04 నుంచి రూ.11.21 లక్షల (ఎక్స్-షోరూం) ప్రైస్ రేంజ్లో ఉంటుంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్ అనే రెండు పవర్ట్రైన్ ఆప్షనలతో వస్తుంది. పెట్రోల్ ఇంజిన్ 20 kmpl, డీజిల్ ఇంజిన్ 21 kmpl మైలేజ్ ఇస్తాయి.