Best Jeeps In India : కార్లు సాధారణంగా చిన్నగా ఉంటాయి. ఇవి వ్యక్తిగత అవసరాల కోసం, కుటుంబం మొత్తం ప్రయాణించడానికి అనువుగా ఉంటాయి. వీటిలో సెడాన్, హ్యాచ్‌బ్యాక్, ఎస్యూవీ లాంటి వేరియంట్లు ఉంటాయి. వీటి స్టైల్, డిజైన్ కూడా భిన్నంగా ఉంటాయి. ఇక జీప్స్ విషయానికి వస్తే, ఇవి చూడడానికి చాలా పెద్దగా, స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇవి రోడ్లపైనే కాదు, ఆఫ్-రోడ్లపై కూడా డ్రైవ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. అందుకే ఈ ఆర్టికల్‌లో ఇండియాలోని బెస్ట్ జీప్స్ గురించి తెలుసుకుందాం.
1. Mahindra Thar :మహీంద్రా థార్‌ను మొదటిసారిగా 2010లో భారతదేశంలో ప్రవేశపెట్టారు. దీనిలో ఎన్నో అప్డేటెడ్ వెర్షన్స్ వచ్చినప్పటికీ, డిజైన్‌లో మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు. ఈ జీప్ గుండ్రని హెచ్ల్యాంప్స్తో, ఫ్రంట్ గ్రిల్‌తో చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీని ఇంటీరియర్‌ను చాలా విశాలంగా, ఫంక్షనల్ డిజైన్‌తో రూపొందించారు. ఈ థార్ జీప్ టైర్లు చాలా పెద్దగా ఉంటాయి. మంచి గ్రౌండ్ క్లియరెన్స్, ఫోర్-వీల్-డ్రైవ్ సెటప్‌తో వచ్చే ఈ జీప్ ఆఫ్-రోడ్ డ్రైవ్‌కు చాలా అనువుగా ఉంటుంది. మార్కెట్లో ఈ మహీంద్రా థార్ ధర సుమారుగా రూ.11.35 లక్షలు నుంచి రూ.17.60 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
- ఇంజిన్ - 2184 సీసీ - 4 సిలిండర్స్
- మ్యాక్స్ పవర్ - 130.07 bhp@3750 rpm
- మ్యాక్స్ టార్క్ - 300 Nm@1600-2800 rpm
- ట్రాన్స్మిషన్ - ఆటోమేటిక్
- సిటీ మైలేజ్ - 9 కి.మీ/ గంట
- ఫ్యూయెల్ టైప్ - డీజిల్
- ప్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 57 లీటర్స్
- గ్రౌండ్ క్లియరెన్స్ - 226 mm
- సీటింగ్ కెపాసిటీ - 4
- బాడీ ఫిలాసఫీ - ఎస్యూవీ
2. Jeep Wrangler :అమెరికాకు చెందిన మోస్ట్ పాపులర్ జీప్ రాంగ్లర్. విల్లీస్ జీప్ సక్సెసర్‌గా ఇది మార్కెట్లోకి వచ్చింది. దీనిలో సిగ్నేచర్ వర్టికల్ ఫ్రంట్ గ్రిల్, ట్విన్ హెడ్‌ల్యాంప్స్, పెద్ద వీల్ ఆర్చ్‌లు ఉంటాయి. ఈ జీప్ చాలా స్ట్రాంగ్ బాడీ కలిగి ఉంటుంది. దీనిని ప్రధానంగా ఆఫ్-రోడ్ డ్రైవింగ్ కోసం రూపొందించారు. అందువల్ల ఎలాంటి గతుకుల రోడ్లపై అయినా, బురదలో అయినా చాలా ఈజీగా దీనిని డ్రైవ్ చేయవచ్చు. ఈ గో-ఎనీవేర్-జీప్ ధర మార్కెట్లో రూ.67.65 లక్షల నుంచి రూ.71.65 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
- ఇంజిన్ - 1995 సీసీ - 4 సిలిండర్స్
- మ్యాక్స్ పవర్ - 268.20 bhp@5250 rpm
- మ్యాక్స్ టార్క్ - 400 Nm@3000 rpm
- ట్రాన్స్మిషన్ - ఆటోమేటిక్
- ARAI మైలేజ్ - 10.6 కి.మీ/ గంట
- ఫ్యూయెల్ టైప్ - పెట్రోల్
- గ్రౌండ్ క్లియరెన్స్ - 237 mm
- సీటింగ్ కెపాసిటీ - 5
- బాడీ ఫిలాసఫీ - ఎస్యూవీ
3. Mahindra Bolero :ఇండియాలోని మోస్ట్ పాపులర్ జీప్ల్లో మహీంద్రా బొలెరో ఒకటి. దాదాపు ఒక దశాబ్ధం కిందట దీనిని మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఈ జీప్ చాలా దృఢంగా, మినిమలిస్టిక్ ఇంటీరియర్‌తో, విశాలమైన క్యాబిన్ స్పేస్‌తో, ఫంక్షనల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ మహీంద్రా బొలెరో ఫ్రంట్ గ్రిల్‌తో, మస్కులర్ డిజైన్‌తో చూడడానికి చాలా బాగుంటుంది. స్టాండ్-అవుట్ వీల్స్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, బెస్ట్ సస్పెన్షన్ సెటప్ ఉండడం వల్ల కఠినమైన రోడ్లపై కూడా చాలా హాయిగా దీనిని డ్రైవ్ చేయవచ్చు. తక్కువ ధరలో మంచి జీప్ కొనాలని ఆశించేవారికి ఈ మహీంద్రా బొలెరో మంచి ఆప్షన్ అవుతుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.9.98 లక్షల నుంచి రూ.10.91 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
- ఇంజిన్ - 1493 సీసీ - 3 సిలిండర్స్
- మ్యాక్స్ పవర్ - 74.96 bhp@3600 rpm
- మ్యాక్స్ టార్క్ - 210 Nm@1600-2200 rpm
- ట్రాన్స్మిషన్ - మాన్యువల్
- ARAI మైలేజ్ - 16 కి.మీ/ గంట
- సిటీ మైలేజ్ - 14 కి.మీ/ గంట
- ఫ్యూయెల్ టైప్ - డీజిల్
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 60 లీటర్స్
- గ్రౌండ్ క్లియరెన్స్ - 180 mm
- సీటింగ్ కెపాసిటీ - 7
- బాడీ టైప్ - ఎస్యూవీ