Cell Phone Signal Issues in Adilabad District : ఫోన్లో సిగ్నల్ రాకపోతే ఏం చేస్తాం? కాస్త పక్కకు వెళ్లి మాట్లాడతాం. మరీ వినిపించడం లేదంటే ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఆన్ చేసి వాడుతాం. కానీ వీరు మాత్రం ఏకంగా పక్కూరికి వెళ్లాల్సి వస్తోంది. మరి ఇదొక్కడో చూద్దామా. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నూర్ పంచాయతీలో బీఎస్ఎన్ఎల్ ఫోన్లో సంకేతాలు అందక శాంతాపూర్, సాయినగర్, హర్కాపూర్, చిన్నమన్నూర్, గురుజ్, శంభుగూడ తదితర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పది రోజులుగా చరవాణి సంకేతాలు రావడం లేదని తెలిపారు. అత్యవసర పనులు ఉంటే డొంగ్రగావ్, గుడిహత్నూర్, ఇచ్చోడ, గాంధీనగర్‌కు వెళ్లి ఫోన్ చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా, పట్టించుకోవడం లేదని వినియోగదారులు వాపోయారు.
డ్రైవింగ్‌లో ఉంటే ఫోన్ చేయకండి ప్లీజ్ - రాష్ట్రంలో పెరుగుతున్న సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు