Bank Holidays In April 2024 : ఆర్బీఐ ఈ 2024 ఏప్రిల్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం, దేశంలోని వివిధ బ్యాంకులకు ఏకంగా 14 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఈ సెలవుల్లో జాతీయ సెలవులు సహా, కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం మంచిది.
2024 ఏప్రిల్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితా
List of Bank Holidays In April 2024 :
- ఏప్రిల్ 1 (సోమవారం) :ఇయర్లీ క్లోజింగ్ (పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
- ఏప్రిల్ 5 (శుక్రవారం) :బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, జుమత్-ఉల్-విదా (పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
- ఏప్రిల్ 7 (ఆదివారం) :
- ఏప్రిల్ 9 (మంగళవారం) : ఉగాది, గుధిపరా, సాజిబు నొంగ్మపన్బా (పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
- ఏప్రిల్ 10 (బుధవారం) : రంజాన్ (కేరళలోని బ్యాంకులకు సెలవు)
- ఏప్రిల్ 11 (గురువారం) : రంజాన్, 1వ షావాల్ (పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
- ఏప్రిల్ 13 (శనివారం) : రెండో శనివారం, చైరోబా, బోహోగ్ బిహు, బిజు పండుగ, బైశాఖి పండుగ
- ఏప్రిల్ 14 (అదివారం) :
- ఏప్రిల్ 15 (సోమవారం) : బోహాగ్ బిహు/ హిమాచల్ డే (అసోం, మధ్యప్రదేశ్లోని బ్యాంకులకు సెలవు.)
- ఏప్రిల్ 17 (బుధవారం) :శ్రీరామనవమి (పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
- ఏప్రిల్ 20 (శనివారం) :గరియా పూజ సందర్భంగా త్రిపురలోని బ్యాంకులకు సెలవు.
- ఏప్రిల్ 21 (ఆదివారం) :
- ఏప్రిల్ 27 (శనివారం) : నాల్గో శనివారం
- ఏప్రిల్ 28 (ఆదివారం) :