Anant Ambani Radhika Merchant Wedding Card : ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట మరికొన్ని రోజుల్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ముకేశ్ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మార్చంట్ జులై 12న వివాహం బంధంతో ఒక్కటవ్వనున్నారు. రెండు నెలల క్రితం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి.
ఆ వేడుకలకు పెద్ద ఎత్తున సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులతో పాటు విదేశాల నుంచి కూడా అతిరథ మహరథులు విచ్చేశారు. రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ముంబైలో జరిగాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకలే ఆ రేంజ్ లో ఉంటే ఇంక పెళ్లి కార్డ్ ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ ఇప్పటికే పెళ్లి కార్డును కాశీ విశ్వనాధుడి ఆలయంలో సమర్పించి ఆశీస్సులు తీసుకున్నారు. ఇప్పుడు కుటుంబసభ్యులు, సెలబ్రిటీలు, స్నేహితులను ఆహ్వానిస్తున్నారు.
అయితే వెడ్డింగ్ కార్డ్‌ను ఒక ఆలయం రూపంతో బాక్స్‌లాగా తీర్చిదిద్దారు. అమర్చిన రెండు చిన్న తలుపులు తెరవగానే రంగురంగుల లైట్ల వెలుగులో ఓంకారనాదంతో మొదలైన విష్ణు సహస్రనామం వినిపిస్తోంది. వెండితో చేసిన పూజ మందిరాన్ని అమర్చారు. ఆ ఆలయం నలువైపుల వినాయకుడు, దుర్గాదేవి, రాధాకృష్ణ, విష్ణమూరి బంగారు విగ్రహాలను ఏర్పాటు చేశారు. పూజ మందిరమంతా చిన్న చిన్న గంటలతో ముచ్చటగా కనిపిస్తుంది.
అంబానీల వివాహ ఆహ్వాన పత్రికలో మరొక వెండి పెట్టె ఉంటుంది. రెండు తలుపులను విష్ణుమార్తి బొమ్మ ఉంది. పెట్టెను తెరిచినప్పుడు అందులో వివిధ దేవతామూర్తుల చిత్రాలతోపాటు అనంత్ వివాహ వేడుకల వివరాలను తెలిపే కార్డు ఉంది. మూడో బాక్సులో ఓం అని ఎంబ్రాయిడ్ చేసి ఉన్న ఒక క్లాత్, ఒక శాలువ, ఒక చిన్న వెండి బాక్స్‌లో బంగారపు వినాయకుడు, దుర్గామాత, రాధాకృష్ణ, విష్ణుమూర్తి లక్ష్మీ దేవి విగ్రహాలు ఉన్నాయి. వెండి కుబేరుడి పెట్టె కూడా అందించారు అంబానీ కుటుంబం. మొత్తం మీద బంగారం, వెండితో కలిపి తయారు చేసిన వెడ్డింగ్ కార్డుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.