Aadhaar Lock And Unlock Process : కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నా, బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందాలన్నా, ఇలా ఏ పని జరగాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. ఇలా అవసరమున్న ప్రతి చోటా ఆధార్ తో పాటు వేలిముద్ర వివరాలు ఇచ్చేస్తుంటాం. వీటినే అదనుగా తీసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వివిధ మార్గాల ద్వారా ఆధార్ డేటాను సేకరించి నగదును కొల్లగొడుతున్నారు.
ఈ సైబర్ మోసాల నుంచి తప్పించుకోవటానికి ఆధార్‌కు లాక్ చేసుకోవడం ఉత్తమం. కావాల్సినప్పుడు అన్ లాక్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఇటీవల తీసుకొచ్చింది. దీంతో ఇతరులు మీ ప్రమేయం లేకుండా మీ ఆధార్‌ను వినియోగించుకోలేరు. అయితే ఆన్లైన్లో ఈ లాక్/ అన్‌లాక్ సులువుగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఆధార్ కార్డు పోయినా లేదా చోరికి గురైనా లాక్ వేయడం వల్ల ఇతరులు మీ వ్యక్తిగత డేటాను వినియోగించుకోలేరు. అలాగే సైబర్ మోసాలకు కూడా పాల్పడలేరు. మీరు మళ్లీ కొత్త ఆధార్ కార్డును తీసుకున్న తర్వాత అన్ లాక్ చేసుకోవచ్చు. లాక్/ అన్ లాక్ ప్రాసెస్ ఇదే.
ఆధార్ లాక్ ప్రాసెస్(Aadhaar Lock process):
- ముందుగా మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్ (www.uidai.gov.in) లేదా మై ఆధార్ పోర్టల్ ను ఓపెన్ చేయాలి.
- ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే లాక్/ అన్‌లాక్ బయోమెట్రిక్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అందులో లాక్/అన్‌లాక్ ఎలా ఉపయోగపడుతుందనే వివరణ ఉంటుంది. ఆ పేజీలో కనిపించే నెక్ట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- వెంటనే ప్లీజ్ సెలెక్ట్ టూ లాక్ ఓపెన్ అవుతుంది. కింద ఉన్న టర్మ్స్ బాక్స్‌లో టిక్ చేసి నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీ ఆధార్ నంబర్, క్యాప్చాను పూరించండి. అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఎనేబుల్ లాకింగ్ ఫీచర్‌పై క్లిక్ చెయ్యాలి. అప్పుడు మీ ఆధార్ కార్డు లాక్ అవుతుంది.
ఆధార్ అన్ లాక్ ప్రాసెస్(Unlocking Aadhaar) :
- ముందుగా మీరు UIDAI అధికారిక వెబ్ సైట్ (www.uidai.gov.in) లేదా మై ఆధార్ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి.
- ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే లాక్/ అన్ లాక్ బయోమెట్రిక్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.
- అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని కూడా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- ఆ తర్వాత మీరు అన్ లాక్ బయోమెట్రిక్ ఆప్షన్‌పై క్లిక్ చెయ్యండి.
- అప్పుడు మీ ఆధార్ అన్ లాక్ అవుతుంది.
సుందర్ పిచాయ్ చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే - సాఫ్ట్వేర్ జాబ్ గ్యారెంటీ! - Sundar Pichai Advice To Engineers
ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? జూన్ 15 వరకు వెయిట్ చేయడం బెటర్ - ఎందుకో తెలుసా? - Income Tax Return Filing