Pahalwan Baba At Maha Kumbh : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా వెరైటీ బాబాలు, సన్యాసులతో కళకళలాడుతోంది. దేశవిదేశాల నుంచి వచ్చిన బాబాలు తమ ప్రత్యేకతో ప్రజల దృష్టిని ఆకట్టుకుంటున్నారు. వారిలో ఒకరు పహిల్వాన్ బాబా. 50 ఏళ్ల వయసులో కండలు తిరిగి దేహంతో కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
ఈ పహిల్వాన్ బాబా అసలు పేరు రాజ్‌పాల్ సింగ్. యువతను మేలుకోల్పడమే ఆయన లక్ష్యమని పహిల్వాన్ బాబా తెలిపారు. 'డ్రగ్స్ నిర్మూలన, ప్రతి ఒక్కరినీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం, భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చడమే నా లక్ష్యం. నా వయసు 50 ఏళ్లు. ఒంటి చేతితోనే 10వేల పుష్అప్లు చేయగలను. ఈ వయసులో నేనే అంత కష్టపడుతున్నా. అలాంటి యువత నా కంటే నాలుగు రేట్లు చేయగలరు. యువత తప్పుడు సవాసల వల్లే డ్రగ్స్‌కు బానిసలయ్యారు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రల, పెద్దల మాటల వినాలని చెబుతున్నా. నేను చేసే వివిధ రకాల విన్యాసల ద్వారా యువతకు స్ఫూరినిస్తున్నా.' అని పహిల్వాన్ బాబా పేర్కొన్నారు.
ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి చిన్న చిన్న సంతోషాలను త్యాగం చేసి, మంచి ఆహారాన్ని తీసుకోవాలని పహిల్వాన్ బాబా చెబుతున్నారు. గొప్ప నాయకులు దేశం కోసం తమ జీవితాన్ని త్యాగం చేశారని, మనం అంత చేయాల్సిన అవసరం లేదుని అన్నారు. ఫాస్ట్, ఫ్రైడ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండి, ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని ఎక్కువగా తినాలని ఆయన అందరికీ విజ్ఞప్తి చేశారు. ఇలా యువతను మేలుకోల్పడం గతేడాది నుంచే మొదలు పెట్టినట్లు పహిల్వాన్ బాబా తెలిపారు.
#WATCH | #KumbhOfTogetherness | Prayagraj, Uttar Pradesh: Rajpal Singh, also known as Pahalwan Baba, says, " my objective is to awaken the youth, eradicate drugs, make everyone healthy and make india a vishwaguru... i am 50 years old and i can do 10,000 push-ups with one hand...… pic.twitter.com/9TN74m5T8c
— ANI (@ANI) January 23, 2025
మహాకుంభమేళాలో రష్యన్ బాబా - 7 అడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహం
ఇటీవల రష్యాకు చెందిన బాహుబలి బాబా సైతం కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 7 అడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహం, అందమైన ముఖ వర్ఛస్సును కలిగి ఉండటంతో ఆయన్ను అందరూ బాహుబలి బాబా అని పిలుస్తున్నారు. బహుబలి బాబా పిలుచుకునే ఆత్మప్రేమ్ గిరి మహరాజ్ పూర్తి వివరాలు కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
6కేజీల ఆభరణాలతో కుంభమేళాకు 'గోల్డెన్' బాబా- ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయట!
కుంభమేళాలో ట్రైపాడ్, స్మార్ట్‌ఫోన్‌తో 'డిజిటల్ బాబా' సందడి- యూత్ టార్గెట్‌గా ప్రవచనాలు!