Woman Loses Huge Money In Cyber Fraud :రోజురోజుకూ సైబరాసురులు రెచ్చిపోతున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఎక్కువ మొత్తంలో డబ్బులు చోరీ చేస్తున్నారు. సైబర్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నా కొందరు మాత్రం వారి వలలో చిక్కుకుపోతున్నారు. తాజాగా ఓ మహిళ ఇలాంటి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుని రూ. కోటికి పైగా కోల్పోయింది.
ఇదీ జరిగింది
మహారాష్ట్రలోని ముంబయికి చెందిన ఓ 78ఏళ్ల మహిళ అమెరికాలో ఉంటున్న తన కుమార్తె కోసం కొన్ని ఆహార పదార్థాలతో పాటు మరి కొన్ని వస్తువులు పంపాలని నిర్ణయించుకుంది. అనంతరం ఓ కొరియర్ సర్వీసును సంప్రదించింది. ఆ కొరియర్ పంపిన తరువాతి రోజు అదే కంపెనీ నుంచి మాట్లాడుతున్నామంటూ ఓ వ్యక్తి వృద్ధురాలికి ఫోన్ చేశాడు. 'మీరు పంపించిన కొరియర్‌లో ఆహారంతో పాటు ఆధార్ కార్డు, గడువు ముగిసిన పాస్‌పోర్ట్‌లు, క్రెడిట్ కార్డులు, 2000 డాలర్ల నగదు, ఇతర వస్తువులు ఉన్నాయి' అని చెప్పాడు. మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆ వృద్ధురాలిని నమ్మించేందుకు మరో ఇద్దరితో కలిసి ఉన్నతాధికారుల్లా నటించారు.