తెలంగాణ

telangana

నత్తనడక వెనుక అసలు 'సీక్రెట్'- ఎందుకు నత్తలు స్లోగా నడుస్తాయో తెలుసా? - why snail moves slowly

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 3:29 PM IST

Why Snail Moves Slowly : నత్తలు నిదానంగా కదులుతాయని అందరికీ తెలుసు. కానీ అవి అలా నెమ్మదిగా ఎందుకు నడుస్తాయి? అని ఎప్పుడైనా సందేహం వచ్చిందా? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్​ చదివేయండి.

Why Snail Moves Slowly
Why Snail Moves Slowly (Getty Images)

Why Snail Moves Slowly :సాధారణంగా ఏదైనా పని నిదానంగా సాగుతున్నా లేదా ఎవరైనా మెల్లగా నడుస్తున్నా సరే. ఏంటీ నత్తనడక అంటూ ఉంటారు చాలా మంది. నిదానంగా సాగే పనులను నత్తనడకతో ఎందుకు పోలుస్తారో మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత నిధానంగా నడిచే ప్రాణుల్లో నత్త ఒకటి అందుకే దానితో పోలుస్తారు. మరి అవి అలా ఎందుకు నెమ్మదిగా నడుస్తాయి? ఇంతకీ అవి గంటకు ఎంత దూరం నడుస్తాయి? లాంటి ప్రశ్నలు మీకు ఎప్పుడైనా వచ్చాయా? మరి ఇంకేందుకు ఆలస్యం నత్తలు నిధానంగా నడవడం వెనక ఆసక్తికర విషయాలు ఏంటో మీరు తెలుసుకోండి.

గంటకు కేవలం మీటర్ మాత్రమే
నత్తలు నడవడానికి తమ శరీరంలో దిగువ భాగంలో ఉన్న పొడవాటి కండరాన్ని ఉపయోగించుకుంటాయి. ఇందులో నుంచి విడుదలయ్యే జిగురు లేదా బురద లాంటి పదార్ధం సాయంతో నడుస్తాయి. ఈ జిగురు విడుదలవుతేనే నత్త కదలుతుంది. ఈ జిగురుతోనే నత్తలు పడిపోకుండా పట్టును సాధించి కదలుతాయి. అయితే జిగురు ఉత్పత్తికి సంబంధించిన అంతర్గత వ్యవస్థ చాలా నెమ్మదిగా సాగుతుంది. ఫలితంగా నత్తలు గంటకు కేవలం ఒక మీటర్​ దూరం మాత్రమే కదులుతాయి. అంటే సుమారు ఓ మూడు అడుగులు వేస్తాయట.

వాస్తవానికి నత్తలకు నిధానంగా కదలడం అనేది పెద్ద సమస్యేమి కాదు. ఎందుకంటే అవి చలనం లేని ఆహార వనరులపైనే ఆధారపడి ఉంటాయి. మొక్కలు లేదా ఏదైనా జీవంలేని వాటిని ఆహారంగా తీసుకుంటాయి. ఆహారంతో ఎలాంటి సమస్య లేకపోయినా, ఏవైనా ఇతర జంతువులు వేటాడే సమయంలో వీటికి ముప్పు ఎదురవుతుంది. ఈ సమయంలో నత్తలు వాటికి కనిపించకుండా ఉండేందుకు రంగులు మార్చుకుంటాయి. కొన్నిసార్లు తమకు ఉన్న పెంకుల్లోకి వెళ్లి తలదాచుకుంటాయి. దీంతో పాటు వాతావరణ మార్పులు తలెత్తినప్పుడు కూడా పెంకుల్లోకి వెళ్లిపోతాయి.

నత్తలు శాకాహారులు
నత్తలు మొలస్కా జాతికి చెందిన జీవులు. ఇవి పూర్తిగా శాకాహార జీవులు. ఇవి అనేక రకాలుగా ఉంటాయి. ఇందులో కొన్ని నత్తలు ఊపిరితిత్తులతో శ్వాస తీసుకుంటే, మరికొన్ని మాత్రం చేపల మాదిరిగా మొప్పల సహాయంతో శ్వాస తీసుకుంటాయి.

చీమలకు ఊపిరితిత్తులు ఉండవ్‌! మరెలా గాలి పీల్చుకుంటాయో తెలుసా? - How Do Ants Breathe

రైతుకు దొరికిన భారీ డైమండ్​- రాత్రికి రాత్రే లక్షాధికారిగా! ఇది రెండోసారట!!

ABOUT THE AUTHOR

...view details