why Kanchipuram Sarees Popular:ఇంద్ర ధనస్సు వర్ణాలను రంగరించి.. ప్రకృతి అందాలను ఆకృతులుగా అచ్చేసిన పట్టు చీరలంటే.. ఏ మహిళకు మాత్రం నచ్చదు చెప్పండి. తమ తనువుపై మెరిసిపోతున్న పట్టు చీరను చూస్తే.. వారి మనసంతా మురిసిపోతుంది! ఎందుకంటే.. "సో బ్యూటీఫుల్.. సో ఎలిగెంట్.. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్" అన్నట్టుగా ఉంటాయి ఈ చీరలు. ఇందులోనూ కంచిపట్టు చీర అంటే.. మాటల్లో చెప్పలేని భావాలు వారి మనసులో మెదులుతాయి. మరి కంచి చీరలు ఎందుకంత స్పెషల్? ఈ విషయం తెలియాలంటే.. ఈ స్టోరీ చూడాల్సిందే.
కంచి పట్టుచీరలను "కంజీవరం లేదా కాంచీపురం చీరలు" అని కూడా పిలుస్తారు. ఈ చీరలు తమిళనాడులోని కాంచీపురంలో తయారవుతాయి. అక్కడే ప్రత్యేకంగా వీటిని నేస్తారు. భారతీయ వస్త్ర ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఈ చీరలు కలిగి ఉన్నాయి. ఇవి ఇంత ఫేమస్ కావడానికి పలు కారణాలు ఉన్నాయి.
స్వచ్ఛమైన పట్టు:కంజీవరం చీరలను స్వచ్ఛమైన పట్టుతో నేస్తారు. స్థానికంగా పండించిన పట్టుతో నేస్తారు. క్వాలిటీ పట్టు కారణంగా చీరలు కొత్త మెరుపు సంతరించుకుంటాయి. అంతేకాకుండా ఇవి బరువు తక్కువ ఉంటాయి.
జరీ వర్క్: కంచిపట్టు చీరలకు అంత లుక్ రావడంలో పట్టు ఓ కారణమైతే.. జరీ వర్క్ వేరే లెవల్. ఇది చాలా కష్టతరమైంది. సాధారణంగా బంగారం లేదా వెండి దారాలతో జరీ వర్క్ చేస్తారు. అందులోనూ ఈ వర్క్ ఎవరు పడితే వారు చేయలేరు. ఎంతో నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు మాత్రమే చేయగలరు. అందుకే ఈ చీరలకు అంత లుక్ వస్తుంది.
బోర్డర్స్ అండ్ పల్లు:చీర ఏదైనా దాని బోర్డర్, పల్లు స్పెషల్ లుక్‌ను అందిస్తాయి. ఈ కంచి చీరల్లో అది అద్భుతంగా ఉంటుంది. బోర్డర్ ఒక డిజైన్, పల్లు ఒక డిజైన్‌తో నేస్తారు. ఈ కాంట్రాస్టింగ్ ఎలిమెంట్స్ చీర డిజైన్, లుక్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్తాయి.
నార్మల్ చీరతో డిజైనర్ లుక్ - ఈ టిప్స్ పాటిస్తే మెరిసిపోతారంతే!