UP Hapur Car Accident :ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు నేరుగా వెళ్లి ట్రక్కును ఢీ కొనడం వల్ల ఆరుగురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. యూపీలోని బ్రజ్ఘాట్ టోల్ ప్లాజా సమీపరంలో సోమవారం అర్థరాత్రి ఈ దుర్ఘటన జరిగింది. డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోయి ట్రక్కును ఢీకొనడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన వ్యక్తిని పోలీసులు మీరఠ్లోని ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఎవరో తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నామని పోలీస్ సూపరింటెండెంట్ అభిషేక్ వర్మ తెలిపారు.
'ఏడుగురు వ్యక్తులు ఒక కారులో మొరాదాబాద్ నంచి దిల్లీ వైపు జాతీయ రహదారిపై వెళ్తున్నారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఘర్ కొత్వాల్ ప్రాంతంలో ఈ కారు అదుపు తప్పి డివైడర్ను దాటిని వెళ్లి ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఆరుగురు వ్యక్తులు స్పాట్లోనే మృతిచెందారు. ఒకరు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనితో పోలీసులు వచ్చి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. టైరు పగిలడం వల్లనే, కారు బ్యాలెన్స్ తప్పి, ట్రక్కును ఢీకొని ఉండవచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది' అని పోలీస్ సూపరింటెండెంట్ అభిషేక్ వర్మ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
కూలిన భారీ హోర్డింగ్- 14మంది మృతి, 74మందికి గాయాలు
మహారాష్ట్ర ముంబయిలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలుల దాటికి ఘాట్కోపర్ ప్రాంతంలో ఓ భారీ హోర్డింగ్ కుప్పకూలి పక్కనే ఉన్న పెట్రోల్ బంకుపై పడింది. ఈ ఘటనలో 14మంది మృతి చెందగా 70 మందికిపైగా గాయపడ్డారు. హోర్డింగ్ కింద అనేక మంది చిక్కుకుపోయారు. ఈ మేరకు అధికారులు మంగళవారం వివరాలు వెల్లడించారు.