Child Fell Into Boiling Pan in Bhopal :నిశ్చితార్థ వేడుకల్లో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు వేడి నూనె బాండీలో పడి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
నిశ్చితార్థ వేడుకల్లో విషాదం- వేడి నూనె బాండీలో పడిన రెండేళ్ల చిన్నారి- కాపాడే లోపే! - CHILD FELL INTO BOILING PAN
వేడి నూనె బాండీలో పడిన రెండేళ్ల చిన్నారి- ఆస్పత్రిలో చికిత్స పొందతూ మృతి
Published : Jan 22, 2025, 5:06 PM IST
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం-భోపాల్లోని శివ్నగర్కు చెందిన రాజేశ్ సాహు అనే వ్యక్తి జనవరి 20న(సోమవారం) తన సోదరుడి నిశ్చితార్థానికి వెళ్లాడు. నిశాత్పురాలోని ఓ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న ఈ వేడుకకు రాజేశ్ కుటుంబ సభ్యులు కూడా వెళ్లారు. కార్యక్రమం పూర్తయ్యక అందరూ భోజనం చేస్తున్నారు. ఆ సమయంలోనే రాజేశ్ చిన్న కుమారుడు అక్షత్ సాహు ఆడుకుంటూ వంట చేసే చోటుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అప్పుడే పోయ్యి మీద నుంచి తీసిన నూనె బాండీలో పడిపోయాడు. అక్షత్ కేకల విన్న కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూసే లోపే బాలుడి శరీరం సగం కాలిపోయింది. వెంటనే చిన్నారిని దగ్గరల్లో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థతి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. చికిత్స పొందతూ అక్షత్ మంగళవారం మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం శవపరీక్షల నిమిత్తం చిన్నారి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలంతో కేసు నమోదు చేసినట్లు నిశాత్పురా ఎస్ఐ రూపేశ్ దూబే తెలిపారు.