తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తిరుమల భక్తులకు అలర్ట్ : శ్రీవారి పుష్కరిణి మూసివేత - ఎప్పుడు, ఎందుకో తెలుసా? - Alert To Tirumala Devotees

Alert To Tirumala Devotees : తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. అక్టోబర్​లో జరిగే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెల మొత్తం స్వామి వారి పుష్కరిణిని మూసివేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది టీటీడీ. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

TTD Key Decision On Srivari Pushkarni
Alert To Tirumala Devotees (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 30, 2024, 12:03 PM IST

TTD Key Decision On Srivari Pushkarni :ప్రపంచ ప్రసిద్ధ ఆలయాల్లో తిరుమల ఆలయం ఒకటి. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాక వివిధ దేశాల నుంచి భక్తులు ఏడుకొండల మీద వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్థం తరలి వస్తుంటారు. ఏడాది పొడవునా శ్రీవారి ఆలయం గోవింద నామాలతో మార్మోగుతుంది. నిత్యం భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకునితిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమలకు సంబంధించిన ప్రతీ సమాచారాన్ని ముందుగానే తెలియజేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా టీటీడీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. ఆగస్టు నెల మొత్తం శ్రీవారి పుష్క‌రిణి మూసి వేస్తున్నట్టు ప్రకటించిది. అందుకు గల కారణమేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తిరుమ‌లలో శ్రీ‌వారి ఆల‌యం వద్ద గల పుష్క‌రిణిని నెలరోజుల పాటు మూసిఉంచడానికి గల కారణమేమిటంటే.. అక్కడ ఉన్న నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ మరమ్మతులు, సివిల్‌ పనులు చేపట్టేందుకు ఆగస్టు ఒకటి నుంచి 31వరకు పుష్కరిణి మూసివేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఈ కారణంగా.. నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదని తెలిపింది. నార్మల్​గా శ్రీవారి పుష్కరిణిలో వాటర్ నిల్వ ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే.. పుష్క‌రిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్త‌మ రీసైక్లింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. నిరంతరాయంగా కొంత శాతం చొప్పన వాటర్​ని శుద్ధి చేసి తిరిగి యూజ్ చేస్తారు.

తిరుమల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల - ఏ రోజు ఏం చేస్తారంటే?

అంతేకాకుండా.. ప్రతిఏటా తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ముందు శ్రీవారి పుష్కరిణికి మరమ్మతు పనులు నిర్వహించడం పరిపాటిగా మారింది. ఇప్పటికే టీటీడీ ఈ ఏడాది(2024) బ్రహ్సోత్సవాలకు సంబంధించిన షెడ్యూల్​ను విడుదల చేసింది. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే 2024, ఆగస్టు 1 తేది నుంచి 31వరకు నెల రోజులు పుష్క‌రిణిలో నీటిని తొల‌గించి చిన్న చిన్న మ‌ర‌మ్మతుల‌ను పూర్తి చేయనున్నారు. ఆ కారణం వల్లనే ఆగస్టు నెల మొత్తం శ్రీవారి పుష్కరిణిని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది.

తిరుమల శ్రీ పుష్క‌రిణి మ‌ర‌మ్మ‌తుల కోసం మొద‌టి ప‌ది రోజుల పాటు నీటిని తొల‌గిస్తారు. ఆ త‌ర్వాత ప‌ది రోజులు పైపులైను, ఇంకా ఏవైనా మ‌ర‌మ్మ‌తులు ఉంటే కంప్లీట్ చేస్తారు. చివ‌రి పదిరోజులు పుష్క‌రిణిలో వాటర్​ నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. అదేవిధంగా స్వామివారి పుష్క‌రిణిలోని నీటి పీహెచ్ విలువ 7 ఉండేలా చూస్తారు. టీటీడీ వాట‌ర్ వ‌ర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు జరగనున్నాయి.

అన్నప్రసాద కేంద్రం ఆధునికీకరణ- తిరుమలను సెట్‌రైట్‌ చేసే దిశగా చర్యలు వేగవంతం!

ABOUT THE AUTHOR

...view details