ETV Bharat / entertainment

RC 16 సూపర్ అప్డేట్​ ఇచ్చిన ఏఆర్​ రెహమాన్!​ - ఏంటంటే? - RC16 MUSIC WORK STARTS

బుచ్చిబాబు సానా - రామ్​ చరణ్​ సినిమా గురించి ఇంట్రెస్టింగ్​ అప్డేట్ ఇచ్చిన ఏఆర్​ రెహమాన్.

AR Rahman RC 16 Movie Update
AR Rahman RC 16 Movie Update (source Getty Images and ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2024, 11:13 AM IST

AR Rahman RC 16 Movie Update : 'ఉప్పెన' ఫేమ్​ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్​గా ఈ మూవీ రెగ్యులర్​ షూటింగ్ మైసూర్​లో​ ప్రారంభమైంది. ఉత్తరాంధ్రతో ముడిపడిన, స్పోర్ట్స్ బ్యాక్​డ్రాప్​ కథ ఇది. రామ్‌ చరణ్‌కు 16వ చిత్రం ఇది. అందుకే ప్రస్తుతం RC16 వర్కింగ్ టైటిల్​తో తెరకెక్కుతోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఓ అప్డేట్ ఇచ్చారు. సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ వర్క్స్‌ మొదలయ్యాయని తెలిపారు. తాను కొన్ని పాటలు కంపోజ్‌ కూడా చేశానని చెప్పిన ఆయన, త్వరలోనే వాటిని వింటారని తెలిపారు.

ఇక ఈ సినిమాలో రామ్​ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ నటిస్తోంది. తెలుగులో ఆమెకు ఇది రెండో సినిమా. ఈ మూవీ షూటింగ్​ సెట్​లో చరణ్‌ ఈ నెలాఖరు నుంచి జాయిన్ అయ్యే అవకాశాలున్నాయి. చిత్రంలో జగపతి బాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సినీ వర్గాలు ఆ మధ్య అధికారికంగా ప్రకటించాయి. భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఉప్పెన తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారని ఆ మధ్య టాక్ నడిచింది. కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ స్వరకర్త.

యూఎస్‌లో తొలిసారి(Ramcharan Game Changer) - రామ్​చరణ్​ నుంచి త్వరలోనే గేమ్ ఛేంజర్ సినిమా రానున్న సంగతి తెలిసిందే. చరణ్‌-శంకర్‌ కలయికలో తెరకెక్కింది. బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటించింది. అయితే ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకను డిసెంబరు 21న యూఎస్‌లో నిర్వహించనున్నారు. అక్కడ ఇలాంటి కార్యక్రమం జరగడం ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదే తొలిసారని చిత్రవర్గాలు పేర్కొన్నాయి.

'పుష్ప 2' ఎఫెక్ట్​ - రేసు నుంచి వైదొలిగిన రష్మిక బాలీవుడ్ సినిమా

ఓటీటీలోకి వచ్చేసిన రూ.100 కోట్ల 'లక్కీ భాస్కర్' - ఎక్కడ చూడాలంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.