Fine For Train Delays : దేశంలో రైల్వేనే అతి పెద్ద రవాణా వ్యవస్థ. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చుతున్నాయి. తరచూ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని మనం వింటూనే ఉన్నాం. దీంతో ప్రయాణికులు సకాలంలో గమ్యస్థానాలకు చేరలేకపోతున్నారు. కార్యాలయాలకు, ఇతర ముఖ్యమైన పనులకు హాజరుకావడానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలా జరిగినప్పుడు ప్రయాణికులు ఫోరంను ఆశ్రయించి తగిన కారణం చూపి నష్టపరిహారం పొందొచ్చు. అయితే వీటికి కొన్ని షరతులు ఉన్నాయి అవేంటో తెలుసుకోండి..!
రూ.60 వేల పరిహారం : రిజర్వేషన్ చేసుకున్న బోగీలో ఓ వ్యక్తి దిల్లీ వెళ్తున్నారు. అకస్మాత్తుగా రైలు ఆగింది. రైలు ఆలస్యం కావడంవల్ల దిల్లీలో వ్యాపార లావాదేవీని అందుకోలేక పోయారు. దీంతో సదరు బాధితుడు వినియోగదారుల హక్కుల ఫోరాన్ని ఆశ్రయించారు. కేసు గెలవడంతో అతనికి రైల్వేశాఖ రూ.60 వేల పరిహారం చెల్లించింది.
పరిహారం చెల్లించాలంటే కొన్ని షరతులు :
- ప్రయాణికుడు రిజర్వుడ్ బోగీలో టికెట్ రిజర్వేషన్ చేసుకొని ప్రయాణించాలి. జనరల్ టికెట్ తీసుకొని ప్రయాణించే వారికి కేసువేసే అవకాశం లేదు.
- రైలు మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా నడిస్తేనే ప్రయాణికులు కేసు వేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ రైలు ఆలస్యానికి కారణాలను ప్రయాణికుడికి ముందుగా లేదా అదే సమయంలో రైల్వే అధికారులు తెలిపితే ఎలాంటి క్లెయిమ్ చేయడానికి వీలు ఉండదు. అందుకే రైలు మీద యాంటీ ఫాగ్ డివైజ్‌ను అమరుస్తున్నారు.
- కొన్ని సమయాల్లో వాతావరణంలో మంచు ఎక్కువగా ఉన్నప్పుడు రైలు వేగం తగ్గి, ప్రయాణం ఆలస్యం కావచ్చు. అప్పుడు డివైజ్ నుంచి నేరుగా ప్రయాణికుడి మొబైల్‌కు మెసేజ్ పంపిస్తుంది. దీంట్లో ఫాగ్ కారణంగా రైలు ఆలస్యం అవుతోందని, దీనికి తాము చింతిస్తున్నామని ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రయాణికుడు ఫోరంను ఆశ్రయించినా ప్రయోజనం ఉండదు.
- రైల్వే అధికారులు కారణం చెప్పకుంటే మాత్రం న్యాయవాది ద్వారా లేదా నేరుగా ఫోరంలో కేసు ఫైల్ చేయవచ్చు. దీనికి రైలు టికెట్‌ను సాక్ష్యంగా పెట్టాలి. తుపాన్లు, రైలు ప్రమాదాలు, ఇతర కారణాలతో రైలు ఆలస్యమైతే ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి, టికెట్ డబ్బులను తిరిగి చెల్లిస్తారు.
తెలంగాణలో 389 కి.మీ. రైలు మార్గంలో 'కవచ్' - ఎక్కువ దూరం ఆమార్గంలోనే!
ప్రయాణికులకు బిగ్ షాక్ - హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం!