ETV Bharat / bharat

రెయిడ్​ చేయడానికి వెళ్లిన ఈడీ టీమ్​పై దాడి - అధికారికి గాయాలు - ED ATTACKED IN DELHI

దిల్లీలో ఈడీ అధికారులపై దాడి - ఎన్​ఫోర్స్​మెంట్​ అఫీసర్​(ఈఓ)కు గాయాలు

ED team attacked in Delhi
ED team attacked in Delhi (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2024, 11:09 AM IST

ED team attacked in Delhi : దిల్లీలోని బిజ్వసన్​ ప్రాంతంలో ఓ సైబర్​ క్రైమ్ సంబంధించి మనీలాండరింగ్​ కేసులో రైడ్​ చేయడానికి వెళ్లిన ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) బృందంపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఈడీ అడిషనల్ డైరెక్టర్​కు గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసును నమోదు చేశారు. సైబర్​ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు, అతడు సోదురుడు ఈడీ బృందంపై దాడి పాల్పడ్డారని, ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉందని, సోదాలు కోనసాగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

దేశవ్యాప్తంగా సైబర్​ క్రైమ్​ నెట్​వర్క్​తో ముడిపడి ఉన్న ఛార్టెడ్​ అకౌంటెంట్స్​ లక్ష్యంగా గురువారం ఈడీ (ED)లోని హై ఇంటెన్సిటీ యూనిట్‌ (HIU) అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో దిల్లీలో బిజ్వాసన్‌ ప్రాంతంలోని ఓ ఫామ్‌ హౌస్‌లో సోదాలు నిర్వహిస్తుండగా, ఐదుగురు దుండగులు అధికారులపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఈడీ అడిషనల్ డైరెక్టర్​​కు గాయలయ్యాయి. దుండగులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారని, దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

క్యూఆర్‌ కోడ్‌, పిషింగ్‌, పార్ట్‌టైమ్‌ జాబ్స్ వంటి స్కామ్‌లతో సహా వేలాది సైబర్‌ క్రైమ్‌ల నుంచి వచ్చిన అక్రమ నిధులను వెలికితీసేందుకు ఈ సోదాలు నిర్వహిస్తునట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ సైబర్​ మోసాల ద్వారా సంపాదించిన డబ్బను దాదాపు 15వేల మ్యూల్ అకౌంట్స్​ (మనీలాండరింగ్, తప్పుడు లావాదేవీలు వంటి చట్టవిరుద్ధమైన కార్యకాలపాలకు ఉపయోగించే ఖాతాలు) మళ్లించారని అధికారులు తెలిపారు. ఆ ఖాతాల డెబిట్​, క్రెడిట్​ కార్డులను ఉపయోగించి యూఏఈ చెందిన PYYPL పేమెంట్ అగ్రిగేటర్​ వర్చవల్ అకౌంట్స్​కు ట్రాన్స్​ఫర్​ చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత PYYPL ఖాతాల్లోని నిధులను ఉపయోగించి క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేసినట్లు తెలిసిందని అధికారులు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.