ETV Bharat / offbeat

మినపప్పులో ఈ రెండు పదార్థాలు వేసి నానబెట్టండి - "దోశలు" హోటల్ స్టైల్​లో క్రిస్పీగా, టేస్టీగా! - HOTEL STYLE ULLI KARAM DOSA

దోశలు క్రిస్పీగా, టేస్టీగా రావాలంటే - పిండి తయారీలోనే సీక్రెట్ అంతా!

Dosa Recipe
Hotel Style Ulli Karam Dosa (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2025, 7:23 AM IST

Hotel Style Ulli Karam Dosa Recipe : మనందరికీ ముందుగా గుర్తొచ్చే బ్రేక్​ఫాస్ట్​ రెసిపీలలో ఫస్ట్ ప్లేస్​లో ఉంటుంది దోశ. అంతేకాదు, ఇది ఎక్కువ మందికి ఇష్టమైన టిఫెన్ కూడా. అయితే, చాలా మంది ఇంట్లో దోశలు వేసుకున్నప్పుడు హోటల్ స్టైల్ టేస్ట్​తో పాటు క్రిస్పీగా రావు. అలాకాకుండా దోశ పిండిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మినపప్పులో ఈ రెండు పదార్థాలు కలిపి నానబెట్టుకోండి. ఆపై రుబ్బి పులియబెట్టుకొని మార్నింగ్ దోశలు వేసుకున్నారంటే చాలు. దోశలు విరిగిపోకుండా హోటల్ స్టైల్లో క్రిస్పీగా, సూపర్ టేస్టీగా వస్తాయి! ఇంతకీ పిండి, దోశల తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • మినపప్పు - 1 కప్పు
  • జీలకర్ర - అరస్పూన్
  • మెంతులు - అరస్పూన్
  • బియ్యం - రెండున్నర కప్పులు
  • అటుకులు - అర కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఉల్లిగడ్డ - 1
  • నూనె - కొద్దిగా(దోశలపై చల్లుకోవడానికి)

'ఎగ్ కారం దోశ' ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? స్పైసీ గార్లిక్ చట్నీతో టేస్ట్ అదుర్స్!

తయారీ విధానం :

  • దోశలు క్రిస్పీగా, టేస్టీగా రావాలంటే ముందుగా పిండిని పర్ఫెక్ట్​గా తయారుచేసుకోవాలి. పిండి తయారీ కోసం మినపప్పుని నానబెట్టేటప్పుడు అందులో ఈ రెండు పదార్థాలు వేయాలి. అవే జీలకర్ర, మెంతులు.
  • ఇందుకోసం ముందుగా ఒక బౌల్​లో మినపప్పు, జీలకర్ర, మెంతులు తీసుకొని అన్నింటినీ ఒకసారి శుభ్రంగా కడగాలి. ఆపై అందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని కనీసం నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి.
  • మరో గిన్నెలో బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి, సరిపడా వాటర్ పోసి రైస్​ని కూడా నాలుగు గంటల పాటు నాననివ్వాలి.
  • నాలుగు గంటల అనంతరం నానబెట్టిన మినపప్పు మిశ్రమాన్ని వాటర్ వడకట్టి మిక్సీ జార్​లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం అదే మిక్సీ జార్​లో నానబెట్టిన బియ్యాన్ని వాటర్ వడకట్టి వేసుకొని, తగినన్ని నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత బియ్యప్పిండిని ముందుగా మిక్సీ పట్టుకున్న మినపప్పు మిశ్రమంలో వేసుకోవాలి.
  • ఇప్పుడు అదే మిక్సీ జార్​లో కడిగి, ఐదు నిమిషాల పాటు నానబెట్టిన అటుకులు, కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్​లా మిక్సీ పట్టుకోవాలి. ఆపై దీన్ని మినపప్పు మిశ్రమంలో వేసుకొని పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. అనంతరం గిన్నెపై మూత పెట్టి రాత్రంతా పులియబెట్టుకోవాలి.
  • ఉదయాన్నే ఒక చిన్న గిన్నెలోకి ఆ రోజుకి కావాల్సినంత మిశ్రమాన్ని తీసుకొని ఉప్పు, తగినన్ని వాటర్ వేసుకొని దోశ పిండి మాదిరిగా చక్కగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై దోశ పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత పొట్టు తీసిన ఉల్లిగడ్డను చాకుకు గుచ్చి దానితో వేడెక్కిన పాన్ మొత్తం రుద్దాలి.
  • ఆ తర్వాత గరిటెడు కలిపి పెట్టుకున్న పిండిని వేసుకొని దోశ మాదిరిగా అనుకోవాలి. ఆపై దాని మీద కొద్దిగా నూనె, కారం చల్లుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, క్రిస్పీ అండ్ సూపర్ టేస్టీ "హోటల్ స్టైల్ ఉల్లి కారం దోశ" రెడీ!

సూపర్ టేస్టీ "సగ్గుబియ్యం దోశలు" - నిమిషాల్లో చేసుకోండిలా! - అందరికీ చాలా చాలా నచ్చేస్తుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.