ETV Bharat / entertainment

'పుష్ప 2' ఎఫెక్ట్​ - రేసు నుంచి వైదొలిగిన రష్మిక బాలీవుడ్ సినిమా - PUSHPA 2 VS CHHAVA

'పుష్ప 2' దెబ్బకు వాయిదా పడిన రష్మిక కొత్త హిందీ సినిమా! - కొత్త రిలీజ్​ డేట్ ఎప్పుడంటే?

Pushpa 2 VS Chhava
Pushpa 2 VS Chhava (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2024, 10:48 AM IST

Pushpa 2 VS Chhava : సోషల్ మీడియాలో 'పుష్ప 2' తుపాను మొదలైపోయింది. మరో వారం రోజుల్లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా పుష్ప రాజ్ మేనియానే కనపడుతోంది. డిసెంబర్ 5న బాక్సాఫీస్ ముందుకు రానున్న ఈ చిత్రం కచ్చితంగా భారీ వసూళ్లను సాధిస్తుందని అంతా ఆశిస్తున్నారు.

పైగా పుష్ప రాజ్​కు సౌత్​ కన్నా నార్త్​లో మరింత క్రేజ్ ఎక్కువ! మొదటి భాగం విడుదల సమయంలోనే నార్త్​లో పుష్పకు ఊహించని రేంజ్​లో కలెక్షన్స్​ వచ్చాయి. అక్కడి వారంతా పుష్ప రాజ్​ యాటిట్యూడ్​ యాక్టింగ్​కు ఫిదా అయిపోయారు. దీంతో బాలీవుడ్​లో పుష్ప 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అక్కడి వాళ్లంతా ఈ సినిమా కోసం ఎంతో అతృతగా ఎదురు చూస్తున్నారు.

Chhava 2 Movie Postpone : అయితే బీటౌన్​లో పుష్ప 2కు పోటీగా 'ఛావా' సినిమా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 6న బాక్సాఫీస్​ ముందుకు వచ్చేలా ప్లాన్ చేసుకుంది. కానీ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుంది. పుష్ప 2కు ఉన్న క్రేజ్​ దృష్ట్యా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ సినిమా వాయిదా వేసినట్లు మూవీ టీమ్ అఫీషియల్​గా ప్రకటించింది. డిసెంబర్‌ 6 నుంచి ఫిబ్రవరి 14కు వాయిదా పడినట్లు తెలిపింది.

మరో విషయమేమిటంటే పుష్ప 2లో హీరోయిన్ రష్మిక శ్రీవల్లిగా నటించింది. ఛావాలోనూ ఆమెనే శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో నటించింది. దీంతో ఒక్క రోజు గ్యాప్​లోనే రష్మిక నటించిన రెండు సినిమాలు రిలీజ్ అవుతాయని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఛావా వెనక్కి తగ్గింది. దీంతో ఆమె ఈ ఏడాది పుష్ప 2 ముగించి, వచ్చే ఏడాది ఛావాతో ప్రారంభించనుందన్నమాట.

'ఛావా' విషయానికొస్తే విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రలో నటించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా దీన్ని రూపొందించారు. లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహించారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం విక్కీ కౌశల్​ గుర్రపు స్వారీ, కత్తిసామును ప్రత్యేకంగా నేర్చుకున్నారు.

ఓటీటీలోకి వచ్చేసిన రూ.100 కోట్ల 'లక్కీ భాస్కర్' - ఎక్కడ చూడాలంటే?

'మాటిస్తున్నా, ఇకపై అలా చేస్తా' : ప్రభాస్​ బాటలోనే అల్లు అర్జున్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.