ETV Bharat / state

ప్రీలాంచ్​ ఉచ్చులో మీరు చిక్కుకోకండి - ముందు ఎల్పీ నెంబర్​ గురించి తెలుసుకోండి

దరఖాస్తు చేయకముందే ప్రీలాంచ్‌ దందా - ఎల్పీ నంబర్‌ రాకుండానే విక్రయాలు - ఫాం ల్యాండ్స్ పేరుతో 650 మంది నుంచి డబ్బుల వసూళ్లు

REAL ESTATE IN HYDERABAD
FRAUD IN THE NAME OF PRE LAUNCHING (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2024, 11:26 AM IST

Real Estate in Hyderabad : నచ్చిన హీరో, క్రికెటర్‌ ప్రచారకర్త అని, స్థలం కొంటే వెండి కాయిన్‌ ఇస్తామని, లక్కీ డ్రాలో విజేతలకు విహార యాత్ర, ప్రతి గజం మీద రూ.500 డిస్కౌంట్​ ఇలాంటి ప్రకటనలు చూసి ప్రీలాంచ్‌లో స్థలాలు కొంటున్నారా? అయితే మీరు మోసపోవడానికి దగ్గరగా ఉన్నట్టే. ఎందుకంటే నగరంలో తాజాగా బయట పడుతున్న ప్రీలాంచ్‌ మోసాలే ఇందుకు ఉదాహరణ.

నగరానికి చెందిన ఆర్‌జీ వెంబర్స్‌, మెసర్స్‌ ఆర్‌ హోమ్స్‌ ఇన్‌ఫ్రా ప్రీలాంచ్‌ పేరుతో దాదాపు రూ.200 కోట్ల వరకు టోకరా వేశాయి. ఘట్‌కేసర్, కర్తనూర్‌, సంగారెడ్డి, పటాన్‌చెరువు తదితర ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు, ఫాంల్యాండ్స్‌ తక్కువ ధరకు విక్రయిస్తామని ఆశ చూపడంతో దాదాపు 650 మంది వారికి భారీగా డబ్బులు చెల్లించారు. రెండు, మూడేళ్లు దాటినా స్థలాలు అప్పగించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

పుట్టగొడుగుల్లా స్థిరాస్తి సంస్థలు : నగరంతో పాటు శివార్లలో స్థిరాస్తి వ్యాపార సంస్థలు పుట్టగొడుగుల్లా ఎక్కడపడితే అక్కడ పుట్టుకొస్తున్నాయి. పలు సంస్థలు జనాలకు కుచ్చుటోపీ పెడుతున్నాయి. ముఖ్యంగా ప్రీలాంచ్‌ పేరుతో పెద్ద ఎత్తున దందా కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి అపార్ట్‌మెంట్‌, లేఅవుట్ ఏర్పాటు చేయాలంటే సంబంధిత జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ లేదంటే మున్సిపాలిటీల నుంచి ముందుగా అనుమతులు తీసుకోవాలి. లేఅవుట్, బిల్డింగ్‌ పర్మిషన్‌ పక్కాగా తీసుకున్న తర్వాతే వాటిని విక్రయించాలి. కానీ కొన్ని సంస్థలు అనుమతులు తీసుకోకుండానే ప్రీలాంచ్‌ పేరుతో విక్రయిస్తున్నారు.

అమ్మేసి జారుకుంటున్నారు : లేఅవుట్‌ వేయాలంటే జీహెచ్‌ఎంసీ లేదా హెచ్‌ఎండీఏ జిల్లాల పరిధిలో డీటీసీపీ నుంచి అనుమతులు తీసుకోవాలి. అప్పుడే లేఅవుట్‌ పర్మిషన్‌ నంబరు(ఎల్‌పీ) వస్తుంది. ఆ తర్వాతే ప్లాట్లు విక్రయించాలి. అనంతరం మూడేళ్లలోపు రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, పార్కులు ఇతర మౌలిక వసతులతో కూడిన సదుపాయాలు కల్పించాలి. అప్పటివరకు 10 శాతం ప్లాట్లు ప్రభుత్వ సంస్థల వద్ద తనఖా కింద ఉంటాయి.

ఇలా సౌకర్యాలు కల్పించిన తర్వాత అధికారులు పరిశీలించి సంతృప్తి చెందితే పూర్తి లేఅవుట్‌ అనుమతులు మంజూరు చేస్తారు. కానీ చాలామంది రియల్టర్లు సౌకర్యాలు కల్పించకుండానే తనఖా పెట్టినవి మినహా మిగతావన్నీ అమాయక ప్రజలకు విక్రయించి మెల్లగా జారుకుంటున్నారు. నగర శివార్లలో ఫాంల్యాండ్‌ పేరుతో పెద్ద దందా నడుస్తోంది. అనుమతులు లేకుండానే తక్కువ ధరకే విక్రయిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. కొందరైతే స్థలాలు చూడకుండానే తొందరగా అడ్వాన్సులు చెల్లిస్తున్నారు. ఫాంల్యాండ్‌లో ఇళ్లు కట్టుకోవాలంటే నిబంధనలు వర్తించవు.

రియల్ ఎస్టేట్ లేటెస్ట్ రిపోర్ట్- హైదరాబాద్​లో అతితక్కువ గ్రోత్- టాప్ 8 సిటీస్​లో లాస్ట్!

స్థిరాస్తి కొనుగోలు చేసేందుకు వెయిట్ చేస్తున్నారా? - అయితే మీకు ఇదే సువర్ణ అవకాశం! - Real Estate Market In Hyderabad

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.