తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుడ్​ న్యూస్- 3 కోట్ల కుటుంబాలకు త్వరలో కొత్త ఇళ్లు- మోదీ కేబినెట్​ కీలక నిర్ణయం - CENTRAL CABINET MEETING 2024

Modi Cabinet 2024 First Meeting
Modi Cabinet 2024 First Meeting (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jun 10, 2024, 5:29 PM IST

Updated : Jun 10, 2024, 6:32 PM IST

Modi Cabinet 2024 First Meeting : నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక మంత్రివర్గ తొలి భేటీ ప్రారంభమైంది. 7 లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని మోదీ నివాసంలో మంత్రివర్గ భేటీ జరుగుతోంది. మంత్రివర్గ భేటీ తర్వాత మంత్రులకు శాఖల కేటాయించే అవకాశం ఉంది.

LIVE FEED

6:18 PM, 10 Jun 2024 (IST)

కేబినెట్ కీలక నిర్ణయం

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద దేశంలో కొత్తగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం అందించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే మంత్రివర్గ సమావేశం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన వారి కోసం మొత్తం 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం అందించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గత పదేళ్లలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద 4కోట్ల 21లక్షల ఇళ్ల నిర్మాణం జరిగింది. వాటికి ప్రాథమిక మౌలిక వసతులు కల్పించినట్లు అధికారులు తెలిపారు.

Last Updated : Jun 10, 2024, 6:32 PM IST

ABOUT THE AUTHOR

...view details