Horoscope Today February 1st 2025 : 2025 ఫిబ్రవరి 1వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. సమాజంలోని గొప్ప వ్యక్తులతో పరిచయాలు రానున్న రోజుల్లో ఉపయోగకరంగా ఉంటాయి. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది. వ్యాపారంలో ఊహించని విజయాన్ని అందుకుంటారు. కుటుంబ పెద్దల సలహాలు పాటిస్తే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.
వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులు ఈ రోజు గొప్ప విజయాలను అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు పని పట్ల ఏకాగ్రతతో ఉండాలి. సహోద్యోగులతో, ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పనిభారం అధికంగా ఉన్నప్పటికీ అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలాసాల కోసం, స్నేహితుల కోసం అధికంగా ధనవ్యయం చేస్తారు. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు ఉండవచ్చు. వ్యాపారులు ఈ రోజు తీవ్రమైన పోటీని చూడాల్సి ఉంటుంది. ఆర్థిక నష్టాలు సంభవించే సూచనలున్నాయి. పెట్టుబడులు, స్పెక్యూలేషన్లకు ఈ రోజు అనుకూలం కాదు. ఇతరులతో వాదనలకు దూరంగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో జాప్యం ఉండవచ్చు. పనులు సకాలంలో పూర్తి కాకపోవడం అసహనం కలిగిస్తుంది. ఆర్థిక సమస్యలు చికాకు కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడవచ్చు. వ్యాపారంలో భాగస్వాముల మధ్య వివాదాలు తారస్థాయికి చేరుకుంటాయి. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. నవగ్రహ శ్లోకాలు పఠించడం ఉత్తమం.
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారిని ఈ రోజు అదృష్టం వరిస్తుంది. అనేక మార్గాల నుంచి ధనదాయం ఉంటుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా వుంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. అనుకోని ధన లాభం ఉండవచ్చు. సంఘంలో పరపతి పెరుగుతుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.
తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరమైన సమావేశాలలో మీ వాక్పటిమతో అందరినీ ఆకర్షిస్తారు. మీ ఆలోచనా విధానం ఇతరులను ప్రభావితం చేస్తుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆడంబరాలకు పోయి వృధా ఖర్చులు చేయవద్దు. నిరాడంబరంగా ఉండటానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆంజనేయ స్వామి దండకం పఠించడం ఉత్తమం.
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహ సంచారం అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ రోజు పట్టిందల్లా బంగారం అవుతుంది. చేసే ప్రతిపని విజయవంతమవుతుంది. వ్యాపార పరంగా గతంలో దూరమైన భాగస్వాములు తిరిగి మీ చెంతకు చేరతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆసక్తి చూపిస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త పడండి. బంధువులతో సంబంధాలు బాగుంటాయి. ఒక కీలకమైన వ్యవహారంలో అనుభవజ్ఞుల సలహా మేరకు ముందుకెళ్తే మంచిది. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రోజు ఆర్థికంగా బాగుంటుంది. పెట్టుబడులు ద్వారా మంచి లాభాలు పొందుతారు. కొన్ని ఘటనల వలన కలత చెందే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శనిదేవుని శ్లోకాలు పఠించడం ఉత్తమం.
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఊహించని ఆర్థిక లాభాలతో ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ప్రశాంతత కలిగిస్తుంది. సన్నిహితుల నుంచి కానుకలు అందుకుంటారు. వైవాహిక జీవితం ఆనందమయంగా గడుస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ శుభకరం.
మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో ప్రతికూలతలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో, వ్యక్తిగతంగా కఠినమైన పరిస్థితులు ఉండవచ్చు. ధననష్టం సంభవించే సూచన ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ప్రియమైనవారితో వివాదాలు, మనస్పర్థలకు అవకాశం ఉంది. శివాలయ సందర్శనం మేలు చేస్తుంది.