- మన్మోహన్ సింగ్ నివాసానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
- మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు ఆయన నివాసానికి చేరుకున్న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
- మోతీలాల్ నెహ్రూ రోడ్డులోని మన్మోహన్ నివాసంలో ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివదేహం
'ఆయన్ను గుర్తుచేసుకుని ప్రజలు ఎప్పటికీ గర్వపడతారు' - మన్మోహన్ మృతిపట్ల CWC సంతాపం - MANMOHAN SINGH PASSED AWAY
Published : Dec 27, 2024, 8:50 AM IST
|Updated : Dec 27, 2024, 7:26 PM IST
Manmohan Singh Passed Away Live Updates : భారత మాజీ ప్రధాన మంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. గురువారం రాత్రి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడం వల్ల వెంటనే కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌కు తరలించారు. రాత్రి 8.30 గంటల సమయంలో అత్యవసర వార్డులో చేరిన ఆయనను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గురువారం రాత్రి 9.51 గంటల సమయంలో ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
LIVE FEED
మన్మోహన్ సింగ్ నివాసానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
మన్మోహన్- అత్యుత్తమ రాజనీతిజ్ఞుడు: పుతిన్
- మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై సంతాపం ప్రకటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్
- అత్యుత్తమ రాజనీతిజ్ఞుడని గుర్తు చేసుకున్న పుతిన్
- వివిధ ఉన్నత స్థానాల్లో పని చేసిన వ్యక్తిగా, భారత ప్రధానిగా విశ్వవేదికపై భారత ఆర్థికాభివృద్ధిని, దేశ ప్రయోజనాలను స్పష్టంగా చెప్పేవారన్న పుతిన్
- ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ఎంతగానో కృషి చేశారన్న పుతిన్
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు- ప్రధాని మోదీకి ఖర్గే అభ్యర్థన
- శనివారం మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రధాని మోదీకి ఓ విజ్ఞప్తి చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే
- స్మారకం నిర్మించబోతున్న స్థలంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని అభ్యర్థించిన ఖర్గే
మన్మోహన్ మృతిపట్ల CWC సంతాపం
మన్మోహన్‌సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ-CWC సంతాపం తెలిపింది. ఈ మేరకు దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైన CWC సభ్యులు సంతాప తీర్మానాన్ని ఆమోదించారు. ఇందులో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఇతర ముఖ్యనేతలంతా పాల్గొన్నారు. దేశానికి మన్మోహన్ చేసిన సేవలను తీర్మానంలో కొనియాడిన CWC ఆయన ఘనమైన వారసత్వాన్ని కొనసాగించాలని పేర్కొంది. దేశం నిజమైన రాజనీతిజ్ఞుడ్ని కోల్పోయిందని సంతాపం తెలిపిన నేతలు మన్మోహన్ కృషి, పట్టుదలతో దేశ తలరాతను తీర్చిదిద్దారని కొనియాడారు. మన్మోహన్ తన జీవితంలో పాటించిన విలువలు ఎప్పటికీ స్పూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. గొప్ప ఆర్థికవేత్తగా, మానవతావాదిగా దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కాంగ్రెస్ నేతలు కీర్తించారు. మన్మోహన్ మంచి మిత్రుడు, దార్శనికుడు, మార్గదర్శి అని సోనియాగాంధీ గుర్తుచేసుకున్నారు. మన్మోహన్‌ను గుర్తుచేసుకొని దేశ ప్రజలు ఎప్పటికీ గర్వపడతారని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు దిల్లీలోని నిగంబోధ్ ఘాట్‌లో శనివారం ఉదయం 11.45 గంటలకు జరుగనున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది.
మన్మోహన్ మృతిపట్ల కేంద్ర క్యాబినెట్ సంతాపం
- మన్మోహన్ సింగ్ మృతిపట్ల సంతాపం తెలిపిన కేంద్ర క్యాబినెట్
- మన్మోహన్ మృతిపట్ల 2 నిమిషాలు మౌనం పాటించిన కేంద్రమంత్రులు
- అధికారిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్న కేంద్రం
శనివారమే అంతిమయాత్ర
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం దిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డ్‌లోని ఆయన నివాసంలో ఉంచారు. "శనివారం ఉదయం (డిసెంబర్ 28న) ఆయన భౌతిక కాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు నివాళులు అర్పించేందుకు అవకాశం కల్పిస్తారు. 9.30 గంటలకు అక్కడి నుంచి శ్మశానవాటికకు ఆయన అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది" అని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థిక సంస్కర్త: రజనీకాంత్
- రాజనీతిజ్ఞుడు అని కొనియాడిన సినీనటుడు రజనీకాంత్
మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించిన ఉప రాష్ట్రపతి
- మన్మోహన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్
- సైన్యం నివాళులు
- మన్మోహన్‌సింగ్ పార్థివదేహానికి సైనికాధికారుల నివాళులు
- మన్మోహన్ పార్థివదేహంపై జాతీయజెండా ఉంచి నివాళులు
- మన్మోహన్‌సింగ్ పార్థివదేహానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నివాళులు
- మన్మోహన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ముర్ము
- ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్‌ను దేశం గుర్తిస్తుంది: మోదీ
- ఆర్‌బీఐ గవర్నర్ సహా అనేక కీలక పదవుల్లో సేవలందించారు: మోదీ
- పీవీ హయాంలో ఆర్థికమంత్రిగా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చివేశారు: మోదీ
- దేశం, ప్రజల పట్ల ఆయన సేవాభావం స్మరించుకోదగింది: మోదీ
- విలక్షణ పార్లమెంటేరియన్‌గా ఆయన సేవలు అందించారు: మోదీ
- ఎన్నో కీలక పదవులు అధిష్టించినా సామాన్య జీవితం గడిపారు: మోదీ
- జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఆయనతో చాలాసార్లు మాట్లాడా: మోదీ
- నా తరఫున, దేశ ప్రజల తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నా: మోదీ
- మన్మోహన్‌సింగ్ పార్థివదేహానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నివాళులు
- మన్మోహన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి
- మన్మోహన్‌సింగ్ పార్థివదేహానికి ప్రధాని మోదీ నివాళులు
- మన్మోహన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ
- మన్మోహన్‌సింగ్ పార్థివదేహానికి అమిత్‌షా, జేపీ నడ్డా నివాళులు
- మన్మోహన్‌సింగ్ నివాసానికి అమిత్‌షా, జేపీ నడ్డా

- మన్మోహన్‌సింగ్ మృతి చాలా బాధాకరం: సోనియాగాంధీ
- మన్మోహన్ మృతి కాంగ్రెస్ కుటుంబానికి తీరని లోటు: సోనియాగాంధీ
- మన్మోహన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి: సోనియాగాంధీ
- రేపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి మన్మోహన్ పార్థివదేహం
- రేపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం మన్మోహన్ పార్థివదేహం
- రేపు దిల్లీ రాజ్‌ఘాట్ సమీపంలో మన్మోహన్‌సింగ్ అంతిమ సంస్కారాలు
- అధికారిక లాంఛనాలతో మన్మోహన్‌సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్న కేంద్రం
- అమెరికా సంతాపం
- మన్మోహన్‌సింగ్ మృతి పట్ల అమెరికా సంతాపం
- దేశ ప్రజలకు సంతాపం తెలుపుతూ అమెరికా విదేశాంగశాఖ సందేశం
- భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి కృషిచేశారు: ఆంటోనీ బ్లింకెన్
- 2 దశాబ్దాల్లో ఇరుదేశాలు సాధించిన ఘనతలకు పునాది వేశారు: ఆంటోనీ బ్లింకెన్
- మన్మోహన్ నేతృత్వంలో ఇరుదేశాల మధ్య పౌర అణుసహకార ఒప్పందం: ఆంటోనీ బ్లింకెన్
- ఆర్థిక సంస్కరణలతో వేగవంతమైన అభివృద్ధికి కృషిచేశారు: ఆంటోనీ బ్లింకెన్
- ఇరుదేశాలు మరింత చేరువ కావడానికి అంకితభావంతో పనిచేశారు: ఆంటోనీ బ్లింకెన్
- మన్మోహన్‌సింగ్ మృతిపట్ల భారత క్రికెట్ జట్టు సంతాపం
- మన్మోహన్ మృతికి సంతాపంగా నల్ల రిబ్బన్లు ధరించిన భారత క్రికెట్ జట్టు
- ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో నల్లరిబ్బన్లు ధరించిన భారత క్రికెట్ జట్టు
- మన్మోహన్‌సింగ్ మృతికి 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం
- అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ సమాచారం
- ఏడు రోజులపాటు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆదేశం
- వారంపాటు వేడుకలు నిర్వహించకూడదని కేంద్ర హోంశాఖ ఆదేశం
- జనవరి 1 వరకు జాతీయజెండాను అవనతం చేయాలని ఆదేశాలు