తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సిబ్లింగ్స్‌ డే : "రక్త సంబంధానికి ప్రేమతో" - మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు ఇలా చెప్పండి! - Siblings Day Wishes - SIBLINGS DAY WISHES

Siblings Day Wishes 2024 : మన జీవితంలో తోబుట్టువుల పాత్ర అనిర్వచనీయం. కష్టంలో, సుఖంలో మన వెన్నంటి నడిచే నేస్తాలు వారు! ఇవాళ తోబుట్టువుల దినోత్సవం. ఈ సందర్భంగా మీ తోడబుట్టిన వారికి "సిబ్లింగ్స్‌ డే విషెస్‌" ఇలా తెలియజేయండి. మీ ప్రేమతో వారిని బందీ చేయండి.

Siblings Day Wishes 2024
Siblings Day Wishes 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 3:51 PM IST

Siblings Day Wishes 2024 : ప్రపంచంలో ప్రేమికుల దినోత్సవం, తల్లిదండ్రుల దినోత్సవం, పిల్లల దినోత్సవం అంటూ.. ఎన్నో రకాల దినోత్సవాలు ఉన్నట్టే.. ఏటా ఏప్రిల్‌ 10వ తేదీన 'తోబుట్టువుల దినోత్సవం' జరుపుకుంటున్నారు. ప్రతీ మనిషి జీవితంలో తోబుట్టువుల పాత్ర వెలకట్టలేనిది. కష్టాల్లో ఉన్నప్పుడు 'నీకు అండగా నేను ఉన్నాను' అని ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటారు. ఆనందాలు కలిసి పంచుకొని సంతోషాన్ని రెట్టింపు చేసుకుంటారు. మన జీవితంలో వారి ప్రాముఖ్యతను గుర్తు చేసుకునేందుకే ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

మరి.. ఈ సందర్భంగా మీ తోబుట్టువులతో మీకున్న అనుబంధం ఎలాంటిదో గుర్తు చేసుకోండి. మీరు కలిసి జరుపుకున్న అత్యంత హ్యాపీ అకేషన్​ ఏదో మననం చేసుకోండి. మీ తోబుట్టువులు మీకు అండగా నిచిలిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ బంధం జీవితాంతం దృఢంగా కొనసాగాలని కోరుకుంటూ.. మీ అన్నా, తమ్ముడు, అక్క, చెల్లికి "సిబ్లింగ్ డే విషెస్‌" తెలియజేయండి. ఇందుకోసం 'ఈటీవీ భారత్' స్పెషల్‌ విషెస్‌ అందిస్తోంది. ఇందులోంచి మీకు నచ్చిన కొటేషన్ సెలక్ట్ చేసుకొని పంపించండి.

"తల్లిలా ప్రేమ, అప్యాయతలను పంచేది అక్కా చెల్లెల్లు..

తండ్రిలా భుజాలపై బాధ్యతలు మోసేది అన్నా తమ్ముళ్లు..

ఇలాంటి వారందరికీ.." -హ్యాపీ సిబ్లింగ్స్‌ డే 2024

"డబ్బుంటే ఎంతో మంది బంధువులు వస్తారు..

వారి అవసరాలు తీరేవారకూ ఎంతో ప్రేమగా నటిస్తారు..

కానీ, డబ్బులతో సంబంధం లేకుండా..

కలకాలం ప్రేమ, అప్యాయతలను పంచే వారే తోబుట్టువులు.."

- హ్యాపీ సిబ్లింగ్స్‌ డే 2024

"బాధలో అయినా.. సంతోషంలో అయినా..

ఎవరు నీతో ఉన్నా.. లేకున్నా..

కలకాలం నీ వెంట నేను ఉంటా.."

-హ్యాపీ సిబ్లింగ్స్‌ డే

"అమ్మ కడుపు నుంచి ప్రాణం పోసుకున్న మన బంధం..

ప్రాణం పోయే వరకూ కొనసాగాలని కోరుకుంటూ.."

-తోబుట్టువుల దినోత్సవ శుభాకాంక్షలు

"నాలోని బాధలు నీతో పంచుకుంటే మాయమైపోతాయి..

నా సంతోషం నీతో షేర్ చేసుకుంటే డబుల్ అయిపోతుంది..

- హ్యాపీ సిబ్లింగ్స్‌ డే

"అన్న అంటే 'అనురాగం'

అక్క అంటే 'అప్యాయత'

తమ్ముడు అంటే 'అనుబంధం'

చెల్లి అంటే 'ఆత్మబంధం'

- హ్యాపీ సిబ్లింగ్స్‌ డే

బంధం భరించలేనంత బరువు కాదు..

విడిపోయేంత విలువ లేనిదీ కాదు..

ఓపికగా భరిస్తే బంధం కొండంత బలగం..

మన బంధం మరింత బలంగా సాగాలని కోరుకుంటూ

-హ్యాపీ సిబ్లింగ్స్‌ డే

"ఎన్నో బంధాలను మనం కలుపుకుంటాం..

కానీ రక్త సంబంధం భగవంతుడే కలుపుతాడు..

మన ఈ బంధం నిండు నూరేళ్లు సాగాలని కోరుకుంటూ.."

- తోబుట్టువుల దినోత్సవ శుభాకాంక్షలు

Sister Ties Rakhi with Legs to Brother : అనుబంధం ముందు చిన్నబోయిన వైకల్యం.. చేతులు లేకున్నా అన్నకు రాఖీ కట్టిన చెల్లి

గుమ్మడి కాయ హల్వా టేస్ట్‌లో బెస్ట్‌ అంతే! ఈజీగా ఇలా చేసేద్దాం! - Pumpkin Halwa Recipe

ABOUT THE AUTHOR

...view details