తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాష్ట్రాలకు SC/ST వర్గీకరణ చేసే అధికారం ఉందా?' సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్​ - sc st sub subclassification act

SC ST Sub Classification : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా లేదా అనే అంశంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

SC ST Sub Classification
SC ST Sub Classification

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 5:08 PM IST

Updated : Feb 8, 2024, 6:18 PM IST

SC ST Sub Classification :రిజర్వేషన్లు అమలు చేయడం కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేపట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా లేదా అనే అంశంపై సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్​ చేసింది. అంతకుముందు, ఈ అంశంపై దాఖలైన 23 పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. అందులో భాగంగా సుప్రీం కోర్టులోబుధవారం సుదీర్ఘ వాదనలు జరిగాయి.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, తద్వారా సరైన పథకాలు రూపొందించేందుకు ప్రభుత్వాలకు వీలు కలుగుతుందని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. వర్గీకరణ ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం నెరవేరుతుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. రిజర్వేషన్ల అసలైన లక్ష్యం చేరుకోవాలంటే కోటాను హేతుబద్ధీకరించడం చాలా ముఖ్యమని తుషార్ మెహతా చెప్పారు. రిజర్వేషన్ ప్రయోజనాలను విస్తరించాల్సిన అవసరం ఉందని, అప్పుడే వెనుకబడిన వర్గాల్లో అట్టడుగున ఉన్న వారికి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలు/కులాలకు సమానత్వం, సమాన అవకాశాలు కల్పించడం రాజ్యాంగం, రాజ్యం (ప్రభుత్వం) లక్ష్యం అని తుషార్ మెహతా అన్నారు. వర్గీకరణ చేపట్టడం ద్వారా అవసరం ఉన్నవారికి ఈ ప్రయోజనాలు అందుతాయని చెప్పారు.

ఇదీ కేసు
వాల్మీకీలు, మఝాబీ సిక్కులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్​ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను కొట్టివేస్తూ పంజాబ్, హరియాణా హైకోర్టు 2010లో ఇచ్చింది. అయితే ఈ తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎస్సీ కేటగిరీలో వర్గీకరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని 2004లో 'ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్' కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మేరకు పంజాబ్ సర్కారు నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. కాగా, హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2011లో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. 2020లో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది. దీనిపై పునస్సమీక్షించాలని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది.

ఎస్సీ వర్గీకరణపై 'రాజ్యాంగ ధర్మాసనం' ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

ఎస్సీ వర్గీకరణపై దృష్టి సారించిన కేంద్రం - ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ప్రధాని ఆదేశం

Last Updated : Feb 8, 2024, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details